Keerthy Suresh | తెలంగాణ యాసపై పట్టు దొరికింది
“దసరా’ చిత్రం నాకు సరికొత్త అనుభూతిని అందించింది. ‘మహానటి’ తర్వాత మరో ఛాలెంజింగ్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె నాని సరసన నటించిన ‘దసరా’ చిత్రం ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
“దసరా’ చిత్రం నాకు సరికొత్త అనుభూతిని అందించింది. ‘మహానటి’ తర్వాత మరో ఛాలెంజింగ్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె నాని సరసన నటించిన ‘దసరా’ చిత్రం ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నేను వెన్నెల అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. సవాలుతో కూడుకున్న పాత్ర ఇది. మేకప్ కోసమే కొన్ని గంటల సమయం పట్టేది. సింగరేణి బొగ్గు గనుల్లో దుమ్ము, ధూళి నడుమ షూటింగ్ చేశాం.
సహాయ దర్శకులు, ఓ ప్రొఫెసర్ సహకారంతో తెలంగాణ యాసను బాగా ప్రాక్టీస్ చేశా. డబ్బింగ్ చెప్పే సమయానికి తెలంగాణ యాసపై పూర్తి పట్టు దొరికింది. ప్రతి సినిమాకు ఓ ఫీల్ ఉంటుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. నా కెరీర్లో మరో గొప్ప చిత్రంగా మిగిలిపోతుందనే భావన కలిగింది. ఈ సినిమాలో ‘ఛమ్కీల అంగీలేసి’ పాట చాలా పాపులర్ అయింది.
ఈ పాట విన్నప్పుడే ప్రతి పెళ్లిలో మార్మోగిపోతుందని అనుకున్నాం. తెలంగాణ జానపద గీతంలోని సొగసు ఏమిటో ఈ పాట ద్వారా నాకు తెలిసింది. లిరిక్స్ అర్థం తెలుసుకుంటే అద్భుతంగా అనిపించింది. బాలీవుడ్లో కొన్ని కథలు విన్నా. అంతగా నచ్చకపోవడంతో అంగీకరించలేదు. మంచి కథ దొరికితే హిందీలో నటిస్తా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

