Aha Naa Pellanta Wedding song | కెరీర్ బిగెనింగ్‌లోనే హాట్రిక్ విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్. ఆయితే అదే జోష్‌ను తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ‘ఉయ్యాలజంపాల’, ‘సినిమా చూపిస్త మామ’, ‘కుమారి 21ఎఫ్’ వంటి వరుస బ్లాక్బస్టర్ల తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్ లేదు. డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తున్నా.. రాజ్‌తరుణ్‌కు మాత్రం హిట్టు వరించడం లేదు. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు.
రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆహా నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ జీ-5లో నవంబర్ 17నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ వెబ్ సరీస్‌పై క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ‘వెడ్డింగ్ సాంగ్’ రిలీజ్ చేశారు. పెళ్ళి వేడుకను ఒక్క పాటలోనే చిత్రబృందం వివరించింది. శివానీ రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను జీ-5 సంస్థతో కలిసి తమాడా మీడియా సంస్థ నిర్మించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందింది.