Vishwak Sen | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్
Vishwak Sen | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, తన గామి చిత్రయూనిట్‌తో దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, చాందిని చౌదరి ఇతర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Vishwak Sen | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, తన గామి చిత్రయూనిట్‌తో దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, చాందిని చౌదరి ఇతర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గామి చిత్రయూనిట్‌కి అర్చకులు ఆశీర్వాదం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం గామి. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ చిత్రం మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. విద్యాధర్ కాగిత ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

