Vijayakanth | కెప్టెన్‌ను వెంటాడిన డయాబెటిస్.. మూడు వేళ్లు తొలగింపు
తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న విజయకాంత్‌ను (Vijayakanth) చాలా కాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడాయి.
Vijayakanth | తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న విజయకాంత్‌ను (Vijayakanth) చాలా కాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడాయి. డయాబెటిస్ కారణంగా ఆయన కుడి కాలి వేళ్లలో మూడింటిని డాక్టర్లు తొలగించారు. 2020లో ఆయన తొలిసారి కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. 2021లో ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం దుబాయ్ తరలించారు. కనీసం నిలబడలేకపోయారని, మాట్లాడే సామర్ధ్యం కూడా తగ్గిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
ఈ ఏడాది నవంబర్ 18న దగ్గు, సర్ది, గొంతునొప్పి కారణంగా చెన్నైలోని మియోటి దవాఖానలో చేరారు. జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. అప్పుడే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి సహకరిస్తున్నారని నవంబర్ 23న డాక్టర్లు ప్రకటించారు. చికిత్స అనంతరం ఈ నెల 11న ఆయనను డిశ్చాక్జీ చేశారు. అయితే మళ్లీ రెండు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యలతో దవాఖానలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనుకు కరోనా నిర్ధారణ అయింది. శ్వాస సరిగా తీసుకోలేకపోతుండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

