Writer Padmabhushan | రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ విడుదల.. సుహాస్‌కు ఇదేదో కలిసొచ్చేలా ఉందే..!
షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు.
Writer Padmabhushan Trailer | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ లభించింది. ఇక సుహాస్ ఇటీవలే ‘హిట్-2’లో ప్రతినాయకుడి పాత్ర పోషించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అనగనగా మన విజయవాడ మహా నగరంలో నెలబడ్జెట్లో వెయ్యి రూపాయలు మిగిలిన పొంగిపోయే నాన్న, సీరియల్స్‌లో ట్విస్ట్‌లు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్‌ను అని ఫీలయ్యే నేను అంటూ సుహాస్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. రైటర్ కావాలనుకున్న సుహాస్ కల కలగానే మిగిలిపోతుందా? సుహాస్ లైఫ్‌లో వచ్చే ట్విస్ట్ ఏంటి? సుహాస్ గర్ల్‌ఫ్రెండ్ తనను ఛీ కొట్టడానికి రీజన్ ఏంటి? అనే ఎన్నో ప్రశ్నలు ట్రైలర్లో కనిపిస్తున్నాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు శణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. సుహాస్‌కు జోడీగా టీనా శిల్పరాజ్ నటించింది. ఆశీష్ విద్యార్థి, రోహిణి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్స్ట్ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

