Actor Kabir Duhan Singh | ఎనిమిదేళ్ల కిందట వచ్చిన జిల్ సినిమాతో విలన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కబీర్ దుహాన్ సింగ్. తొలి సినిమాతో నటుడిగా మంచి పేరే తెచ్చుకున్నాడు. ఒడ్డు, పొడువు, గంభీరత్వం ఇలా అన్ని కలబోసి అసలు విలన్ అంటే ఈ మాత్రం ఉండాలి అనేలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు. కిక్-2, సర్దార్ గబ్బర్‌సింగ్, సాక్ష్యం, కాంచనా-3 వంటి సినిమాలు విలన్‌గా కబీర్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ విలన్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌ను పెళ్లి చేసుకున్నాడు. హర్యానాలోని ఫరిదాబాద్‌లో బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టిఒంట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కబీర్ భార్య సీమ చాహల్ హర్యానాలో మాథ్య్స్ టీచర్అని తెలుస్తుంది. ఇక కబీర్ సింగ్ ఇటీవలే వచ్చిన శాకుంతలంలో అసురరాజుగా కనిపించాడు.