Aadi Sai Kumar | ‘క్రేజీఫెల్లో’ ఫస్ట్‌సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడియస్ ట్యూన్
Crazy Fellow Fisrt Single | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘క్రేజీ ఫెల్లో’ ఒకటి. సిరికి ఫణికృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
‘రావే రావే.. నా చెలియా’ అంటూ సాగే మెలోడీయస్ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. అలరాజు సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ రామచంద్ర ఆలపించాడు. ఆర్ఆర్ దృవన్ సంగీతం అందించిన ఈ పాటలో ఆది లుక్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. సతీష్ ముత్యాల కెమెరా విజువల్స్ బాగున్నాయి. ఈ చిత్రంలో ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Indulge in this beautiful melody #RaveRave song😍🥳
🎶#RRDhruvan#CrazyFellow @AadiSaikumar @DiganganaS @mirnaaofficial @siriki_phani @SriSathyaSaiArt @KKRadhamohan @Sreeram_singer @SatyaYamini1 #AlaRaju #SatishMutyala @GiduturiSatya @adityamusic pic.twitter.com/9enFFaaYnr
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

