Abraham Ozler | అబ్రహం ఓజ్లర్ రివ్యూ
మలయాళం సినిమాలు ఎల్లలు దాటొచ్చి ఇప్పుడు అందరినీ అలరిస్తున్నాయి. పక్కా స్క్రిప్ట్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఈ మలబారు చిత్రాలకు బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయి.
అబ్రహం ఓజ్లర్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: మార్చి 20
నటీనటులు: జయరామ్, మమ్ముట్టి, అనస్వర రాజన్, అరుజన్ అశోకన్ తదితరులు
దర్శకత్వం: మిథున్ మాన్యువల్ థామస్
మలయాళం సినిమాలు ఎల్లలు దాటొచ్చి ఇప్పుడు అందరినీ అలరిస్తున్నాయి. పక్కా స్క్రిప్ట్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఈ మలబారు చిత్రాలకు బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయి. ఓటీటీ వల్ల కేరళ తీరం దాటిన సినిమాలు నైరుతి రుతుపవనాల్లా దేశమంతా విస్తరించి అలరిస్తున్నాయి. తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన అబ్రహం ఓజ్లర్ కూడా రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేస్తున్నది. కథలోకి వెళ్తే.. అబ్రహం ఓజ్లర్ (జయరాం) ఐపీఎస్ ఆఫీసర్. అనుకోకుండా అతని భార్యాపిల్లలు కనిపించకుండా పోతారు. వాళ్లు ఏమయ్యారో అంతుబట్టక ఓజ్లర్ డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు.
మరోవైపు త్రిస్సూర్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. నిందితుడు సర్జికల్ కత్తితో ఈ హత్యలు చేస్తుంటాడు. ఆ మృతదేహాల దగ్గర ‘హ్యాపీ బర్త్ డే’ అని రక్తంతో రాసిన కాగితాలు పడేసి వెళ్తుంటాడు. ఈ హత్య కేసులను చేధించడానికి ఓజ్లర్ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? వీటికీ ఓజ్లర్ కుటుంబం మిస్సవ్వడానికి సంబంధం ఏంటి? అతిథి పాత్రలో కనిపించే అలెక్స్ (మమ్ముట్టి) ప్రాధాన్యం ఏమిటి? వీటన్నిటినీ ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత వేగం సెకండ్ హాఫ్‌లో లేకపోవడం కాస్త మైనస్. అయితే, సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

