Tees Maar Khan | ‘రాక్షసుడికి రక్షకుడు అంటే ఏంటో చూపించండి’.. ఆకట్టుకుంటున్న ‘తీస్ మార్ ఖాన్’ టీజర్!
Tees Maar Khan Teaser | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘తీస్ మార్ ఖాన్’ ఒకటి. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇటీవలే మేకర్స్ జూలై 27న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.
‘ఆఫీస్‌కు వెళ్ళే మా అన్న తిరిగి రాలేడు’ అంటూ టీజర్ మొదలైంది. ‘మనం ఆపలనుకున్నంత పవర్ మన దగ్గరున్న.. మనం ఆపలేనంత పవర్ వాడి దగ్గరుంది’ సార్ అంటూ వచ్చే డైలాగ్ విలన్ బలాన్ని తెలియజేస్తుంది. ‘రాక్షసుడికి రక్షకుడు అంటే ఏంటో చూపించండి’ అనే డైలాగ్‌తో హీరో ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఆది, రాజ్‌పుత్ పాయల్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొత్తం ఆది పవర్ ప్యాక్డ్ షోతో నిండి ఉంది. చాలా కాలం తర్వాత ఆది ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది.
‘ఆర్ ఎక్స్100’ బ్యూటీ రాజ్‌పుత్ పాయల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి నిర్మించాడు. సునీల్, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. ఒకటి స్టూడెంట్ పాత్ర కాగా మరోకటి రౌడి పాత్ర.. ఇంకోటీ పోలీస్ పాత్ర. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

