Tees Maar Khan | ఆది ‘తీస్ మార్ ఖాన్’ బిగ్ అప్డేట్.. !
Tees Maar Khan Big Announcement | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘తీస్ మార్ ఖాన్’ ఒకటి. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించాడు. ఇటీవలే చిత్రం నుండి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్‌ను శుక్రవారం సాయంత్రం 5.04 నిమిషాలకు వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ట్రైలర్ డేట్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. రాజ్‌పుత్ పాయల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి నిర్మించాడు. సునీల్, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. ఒకటి స్టూడెంట్ పాత్ర కాగా మరోకటి రౌడి పాత్ర.. ఇంకోటీ పోలీస్ పాత్ర. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైయ్యాడు.
An Exciting Announcement coming ur way tomorrow at 05:04 PM#TeesMaarKhan🔫💥#AadiSaiKumar #NagamTirupathiReddy @starlingpayal @Mee_Sunil @shamna_kkasim @kalyankumarraja @ThirmalYalla @ImSaiKartheek @TheSaiSatish @ParvathaneniRam pic.twitter.com/9WUkSQAXhJ
— BA Raju's Team (@baraju_SuperHit) July 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

