Raaka First Look | ‘రాకా’గా రాబోతున్న ఐకాన్ స్టార్.. పుట్టినరోజున అల్లు అర్జున్ – అట్లీ క్రేజీ అప్డేట్
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (AA22) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రాకా’ (RAAKA) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. గుండుతో, కళ్లకు కాటుక పెట్టుకుని, ఒంటిపై వింత ఆకృతులతో ఉన్న ఈ లుక్ చూస్తుంటే ఆయన ఏదో ‘వేర్-బీస్ట్’ (జంతువుగా మారే మనిషి) తరహా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
‘జవాన్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. ఆమె ఈ చిత్రంలో ఒక వీరనారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక VFX హంగులతో రూపొందుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం సహా 7 భాషల్లో 2027 వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. “విజన్ బియాండ్ లిమిట్స్” (హద్దులు లేని ఊహ) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Prepare yourself for a vision beyond limits ✨@alluarjun @Atlee_dir @deepikapadukone⁰#राका | #రాకా | #ರಾಕಾ | #ராக்கா | #രാക്ക | #রাকা | راکا# pic.twitter.com/ymTBHoOfpI
— Sun Pictures (@sunpictures) April 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

