Lokesh kanagaraj | లోకేష్ కనగరాజ్‌పై కేసు నమోదు.. డైరక్టర్‌కు మానసిక పరీక్షలు చేయండి
Leo Movie | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లియో’ (LEO). ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా విషయంలో లోకేశ్ పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది.
Leo Movie | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లియో’ (LEO). ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా విషయంలో లోకేశ్ పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది.
లియో సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉందంటూ మధురైకు చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ వేశారు. లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితి బాగా లేదని.. అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. సినిమాలో మారణాయుధాలు, డ్రగ్స్, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉన్నాయని వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని రాజు మురుగన్ పిటిషన్లో కోరారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో ఈ కేసును వాయిదా వేసింది.
అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. లియోలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్ తోపాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ఇతర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

