Ex CEA on Rs2000 | రూ.2000 నోటు విత్ డ్రాయల్తో నో ప్రాబ్లం .. కేంద్ర ఆర్థికశాఖ మాజీ సలహాదారు
Ex CEA on Rs2000 | రూ.2000 నోటు ఉపసంహరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేమీ లేదని కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం స్పష్టం చేశారు.
Ex CEA on Rs2000 | మార్కెట్ నుంచి రూ.2000 కరెన్సీ నోటు ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మాజీ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం సమర్థించారు. శుక్రవారం ఆర్బీఐ అకస్మికంగా చేసిన ఈ ప్రకటనపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆర్బీఐ నిర్ణయం వల్ల సామాన్యుడికి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేంద్రం మీద.. ఆర్బీఐ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కృష్ణమూర్తి సుబ్రమణ్యం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రూ.2000 నోటు ఉపసంహరణ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
రూ.2000 నోటు ఉపసంహరణతో నగదు నిల్వ తగ్గుతుందన్నారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం. ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లలో కొంత భాగం ఎక్కడ ఉందో తెలియదన్నారు. ఇప్పుడు ఆ నోట్లన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల దాడులు, తనిఖీల్లో గుట్టలకొద్దీ బయట పడుతున్న కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్లే ఎక్కువ అని గుర్తు చేశారు.
దేశ జనాభాలో 80 శాతం మంది తమ వద్ద గల రూ.2000 నోట్లను భద్రపరుచుకున్నారు. అలా చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ కేవలం 20 శాతమేనని కృష్ణమూర్తి సుబ్రమణ్యం చెప్పారు. 20 శాతం మంది జనాభా వద్ద 80 శాతం రూ.2000 నోట్లు గుట్టలుగా పడి ఉన్నాయన్నారు. ఇవన్నీ బయటకు వెలికి తీయడానికి ఆర్బీఐ నిర్ణయం ఉపకరిస్తుందన్నారు.
ప్రస్తుతం రూ.2000 నోటును పేమెంట్స్ కోసం ఎక్కువగా వాడటం లేదని కృష్ణమూర్తి సుబ్రమణ్యం గుర్తు చేశారు. ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 కరెన్సీ నోట్ల విలువ కేవలం 10.8శాతమేనని స్పష్టం చేశారు.
ఇప్పుడు దాదాపు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే సాగుతున్నాయని కృష్ణమూర్తి సుబ్రమణ్యం చెప్పారు. కనుక కరెన్సీ నోట్లు.. ప్రత్యేకించి రూ.2000 కరెన్సీ నోటు వాడకం మరింత తగ్గుతుందన్నారు. రూ.2000 నోటుకు ప్రత్యామ్నాయంగా రూ.500 కరెన్సీ నోటు వాడుకోవచ్చునని తెలిపారు.
వచ్చే మూడేండ్లలో అంటే 2026 నాటికి డిజిటల్ పేమెంట్స్ మూడు రెట్లు పెరుగుతాయని వివిధ నివేదికలు చెబుతున్నాయని కృష్ణమూర్తి సుబ్రమణ్యం వెల్లడించారు. కనుక మున్ముందు రూ.2000 నోటు అవసరం ఉండక పోవచ్చునని చెప్పారు. రూ.2000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధంగా మార్చుకోవడానికి ఏ ఇబ్బంది లేదన్నారు. సెప్టెంబర్ 30 తర్వాత దాని చట్టబద్ధతపై మళ్లీ ఆర్బీఐ తన వైఖరి ఏమిటో వెల్లడిస్తుందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

