WhatsApp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మెసేజ్‌లు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు
WhatsApp | వాట్సాప్ తన యూజర్లకు పంపిన మెసేజ్‌లో తప్పు దిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ తీసుకొస్తున్నది. త్వరలో అందుబాటులోకి రానున్నది.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు రోజుకొక కొత్త ఫీచర్ అందిస్తున్నది. మన బంధు మిత్రులకు ఏదైనా మెసేజ్ పంపుతుంటాం.. ఆ మెసేజ్‌ల్లో ఏదైనా ఇతరులకు పంపితే డిలిట్ చేసే ఆప్షన్ గతంలో లేకున్నా.. ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు మనం పంపిన సందేశంలో ఏ చిన్న తప్పు ఉన్నా సరి చేసుకోవడానికి వీలుగా ‘ఎడిట్’ (Edit message) ఆప్షన్ ఫీచర్ తెస్తున్నది. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఎడిట్ ఆప్షన్.. త్వరలో అందరికీ వినియోగంలోకి రానున్నది. వాట్సాప్ ప్రత్యర్థి యాప్ `టెలిగ్రామ్`.. 2016 నుంచి తన యూజర్లకు `ఎడిట్` ఆప్షన్ అందుబాటులోకి ఉంది. ఇప్పుడు తన యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ కూడా ఈ ఫీచర్ తీసుకొస్తున్నది.
తాజాగా అంతర్జాతీయ కాల్స్ పేరిట ఆగంతకుల నుంచి వచ్చే కాల్స్ రింగ్ కాకుండా నిలువరించే ఆప్షన్ కూడా వాట్సాప్ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లను గుర్తు తెలియని వ్యక్తుల నుంచి, అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఇబ్బందికరంగా మారాయి. ఈ కాల్స్ రింగ్ రాకుండా చేసే ఆప్షన్ కూడా ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్నది.
వాట్సాప్ తెస్తున్న ఈ కొత్త ఫీచర్ కింద ఏ సందేశం అయినా 15 నిమిషాల వరకు ఎడిట్ చేయొచ్చు. అయితే, అలా పంపిన మెసేజ్ మీద క్లిక్ చేసి, కాసేపు హోల్డ్‌లో పెట్టాలి. అప్పుడు కాపీ` ఆప్షన్‌తోపాటు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అలా ఎడిట్ ఆప్షన్ ఎంచుకుని మార్పులు చేయవచ్చు. నిర్దేశిత 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత ‘ఎడిటెడ్’ అనే మెసేజ్.. ముందు సందేశం వెళ్లిన వ్యక్తికి కనిపిస్తుంది.
వాట్సాప్ తీసుకొస్తున్న ఈ ‘ఎడిట్’ ఆప్షన్.. ఆండ్రాయిడ్ యాప్‌తోపాటు ఐఓఎస్, వెబ్ యూజర్లకూ అందుబాటులో ఉంటుంది కానీ ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తుందన్న సంగతి బయటపెట్టలేదు. ఎడిట్ ఆప్షన్‌తోపాటు ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న అంతర్జాతీయ కాల్స్ రింగ్స్ రాకుండా నిరోధించే ఆప్షన్ త్వరలో యూజర్లందరికీ వాట్సాప్ తీసుకు రానున్నదని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

