TVS iQube electric | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్ కంపెనీ’ తన టీవీఎస్ ఐక్యూబ్ రేంజ్ స్కూటర్ల ధరలు సవరించింది. కేంద్రం టూ వీలర్స్‌పై ఫేమ్-2 సబ్సిడీ తగ్గించిన తర్వాత ధరలు పెరిగాయి. గత నెల 21 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు టీవీఎస్ ఐ-క్యూబ్ రూ.1,23,184, టీవీఎస్ ఐ-క్యూబ్ ఎస్ రూ.13,8,289లకు డెలివరీ చేస్తారు.
గత నెల 20 వరకు ప్రీ-బుకింగ్స్ చేసుకున్న వారికి టీవీఎస్ ఐ-క్యూబ్ రూ.1,16,184, టీవీఎస్ ఐ-క్యూబ్ ఎస్ రూ.1,28,849లకు లభిస్తాయి. మే వరకు 20 వేలకు పైగా ఐ-క్యూబ్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది లక్షకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు.. ఓలా ఎస్1, ఎథేర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్లతో పోటీ పడతాయి.
భారతదేశంలో ఈవీ పరివర్తనను టీవీఎస్ విస్తరిస్తున్నది. వాహనాల విద్యుద్ధీకరణ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో లక్ష యూనిట్లకు పైగా స్కూటర్లు విక్రయించింది. సంతోషకరమైన కస్టమర్లు ఉన్నారనడానికి ఇది నిదర్శనం అని టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనూ సక్సేనా తెలిపారు.