Small Savings | పోస్టాఫీస్ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో కీలక మార్పులు.. మీకు తెలుసా!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయా పోస్టాఫీస్ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పలు కీలక మార్పులు చేసింది. ఓ కొత్త పథకాన్ని పరిచయం చేస్తూనే.. పెట్టుబడికున్న పరిమితుల్ని సర్దుబాటు చేయడం, వడ్డీరేట్ల గణనను మార్చడం వంటివి చేపట్టింది. పీపీఎఫ్, పీవోటీడీ, పీవోఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్ స్కీముల్లోనూ సవరణల్ని తీసుకొచ్చింది. వాటి విషయానికొస్తే..
- పోస్టాఫీస్ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మార్పులివే
Small Savings | గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయా పోస్టాఫీస్ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పలు కీలక మార్పులు చేసింది. ఓ కొత్త పథకాన్ని పరిచయం చేస్తూనే.. పెట్టుబడికున్న పరిమితుల్ని సర్దుబాటు చేయడం, వడ్డీరేట్ల గణనను మార్చడం వంటివి చేపట్టింది. పీపీఎఫ్, పీవోటీడీ, పీవోఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్ స్కీముల్లోనూ సవరణల్ని తీసుకొచ్చింది. వాటి విషయానికొస్తే..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
గత ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిచయం చేసింది. మహిళలు, బాలికలనుద్దేశించి దీన్ని తీసుకొచ్చారు. నిరుడు ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. కాలపరిమితి రెండేండ్లు. వార్షిక వడ్డీరేటు 7.5 శాతం లభిస్తుంది. డిపాజిట్‌దారులు తమ అవసరాలనుబట్టి పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత అందులో 40 శాతం వరకు తిరిగి తీసుకోవచ్చు. అలాగే 6 నెలల తర్వాత 5.5 శాతం వడ్డీకి డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.
డిపాజిట్‌దారు చనిపోయినా, ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డా డిపాజిట్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే ఒక కుటుంబంలో ఒకరి పేరిట ఈ స్కీముకు సంబంధించిన ఖాతాను పోస్టాఫీస్‌లో తెరిస్తే.. మళ్లీ 3 నెలల వరకు మరొకరి పేరుమీద ఇంకో ఖాతాను తెరవడానికి వీల్లేదు. ఇక ఈ పథకంలో వచ్చే వడ్డీకి టీడీఎస్ వర్తించదు. కానీ ఆర్థిక సంవత్సరంలో రూ.40,000లకు మించి (సీనియర్ సిటిజన్లకు రూ.50,000) వడ్డీని పొందితే టీడీఎస్ ఉంటుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం
2023 బడ్జెట్లో సింగిల్ అకౌంట్ యూజర్ల కోసం ఈ పథకం డిపాజిట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ ఖాతాదారుల కోసం రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం
ఎస్సీఎస్ఎస్లో గరిష్ఠ పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. తద్వారా మరింత డిపాజిట్లపై అధిక వడ్డీరేటును పొందే అవకాశాన్ని వృద్ధులకు కల్పించారు.
పీపీఎఫ్ వడ్డీ గణనలో సవరణలు
పీపీఎఫ్ స్కీం 2019 కింద రెగ్యులర్‌గా జమయ్యే వడ్డీ కంటే 1 శాతం తక్కువగా ముందస్తు ఉపసంహరణ పథకాలపై వడ్డీ ఉంటుంది. ప్రస్తుతమున్న ఐదేండ్ల బ్లాక్ పీరియడ్ నుంచి దీన్ని లెక్కిస్తారు.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పెనాల్టీ
పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లను నిర్ణీత కాలవ్యవధి కంటే ముందే వెనక్కి తీసుకుంటే 2 శాతం జరిమానా పడుతుంది. సదరు ఎఫ్డీలకు నిర్ణయించిన వడ్డీరేటులో 2 శాతం తగ్గించి చెల్లిస్తారు.
ఎస్సీఎస్ఎస్లో మార్పులు
- 55-60 ఏండ్లవారికి తమ రిటైర్మెంట్ ప్రయోజనాల పెట్టుబడికి 3 నెలల సమయం
- ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ పథకంలో పెట్టుబడికి అర్హులు
- ఏడాదిలోపే ఖాతాను మూసేస్తే డిపాజిట్లో 1 శాతం మినహాయిస్తారు
- స్కీం పొడిగింపుపై పరిమితులు లేవు
- పొడిగించిన ఎస్సీఎస్ఎస్ ఖాతాల్లో పెంచిన మెచ్యూరిటీపై వడ్డీ.

Post Office Savings
పోస్టాఫీస్ చిన్నమొత్తాల పొదుపు పథకాలు
1. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ (ఎస్బీ)
2. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (ఆర్డీ)
3. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (టీడీ)
4. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ (ఎంఐఎస్)
5. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అకౌంట్ (ఎస్సీఎస్ఎస్)
6. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (పీపీఎఫ్)
7. సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్ఎస్ఏ)
8. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (8వది) (ఎన్ఎస్సీ)
9. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
10. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

