Suzuki WagonR Facelift | స్పోర్టీ హైటెక్ ఫీచర్లతో జపాన్ మార్కెట్లోకి వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్.. రూ.7.22 లక్షల నుంచి షురూ..!
Suzuki WagonR Facelift | స్పోర్టీ లుక్, హైటెక్ ఫీచర్లతో జపాన్ మార్కెట్లోకి ఎంటరైంది మారుతి బెస్ట్ సెల్లింగ్ వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్.
Suzuki WagonR Facelift | ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. ఇంతకుముందు వచ్చిన విటారా బ్రెజా మోడల్ స్థానే విటారా, బ్రెజా అని వేర్వేరు మోడల్ కార్లను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొలి నుంచి భారతీయుల మనస్సులు దోచుకున్న సుజుకి వ్యాగన్ఆర్ అప్ డేటెడ్ వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్-2023.. ( WagonR Facelift ) జపాన్ మార్కెట్లో ప్రవేశ పెట్టింది. భారత్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న న్యూ-వ్యాగన్ఆర్కు ఇది భిన్నమైంది. స్పోర్టీ లుక్‌తో, పలు హైటెక్ ఫీచర్లతో జపాన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నది. గత నెలలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. జూలైలో వ్యాగన్ఆర్.. 22,588 యూనిట్లు అమ్ముడు పోయింది.
మూడు వేరియంట్లలో వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్
సుజుకి వ్యాగన్ఆర్-2023 ఫేస్‌లిఫ్ట్ ( WagonR Facelift ) మూడు వేర్వేరు వేరియంట్లు..వ్యాగన్ఆర్, వ్యాగన్ఆర్ కస్టమ్ జడ్, వ్యాగన్ఆర్ స్టింగ్రేలుగా వస్తున్నది. స్టింగ్రే వేరియంట్ న్యూ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెల్డ్ ల్యాంప్‌తో వస్తున్నది. ఎంవీపీ లైక్ డిజైన్ తలపించే వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్‌లో టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ వ్యాగన్ఆర్లో స్టాండర్డ్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్ పొందుతుంది.
న్యూ-వ్యాగన్ఆర్ ధరెంతంటే?!
జపాన్‌లో సుజుకి వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్ ( WagonR Facelift ) ధర 12,17,700 నుంచి 15,09,200 యెన్లు (7.22 లక్షల నుంచి రూ.8.96 లక్షలు) పలుకుతున్నది. వ్యాగన్ఆర్ స్టింగ్గ్రే ధర 1,688,500 – 1,811,700 యెన్లు (రూ.10 లక్షల నుంచి రూ.10.75 లక్షలు). వ్యాగన్ఆర్ కస్టమ్ జడ్ మోడల్ ధర 1,474,000 – 1,756,700 యెన్లు (రూ.8.75-రూ.10.43 లక్షలు) పలుకుతున్నది.
భారత్ మార్కెట్లోకి వచ్చే ఏడాది
మారుతి సుజుకి వ్యాగన్ఆర్-2023.. ( WagonR Facelift ) వచ్చే ఏడాది చివర్లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడతారని భావిస్తున్నారు. భారత్‌లో ఆవిష్కరణకు ముందు వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్‌లో మార్పులు తీసుకొస్తారని సమాచారం. సుజుకి వ్యాగన్ఆర్ స్పోర్ట్స్ ఏ బాక్సీ డిజైన్‌తో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

