Tiago EV | భారత మార్కెట్లోకి టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు.. తక్కువ ధరతో లాంచ్
Tiago EV | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ కొత్త ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీని లాంచ్ చేసింది. మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే ఈ ధరలు చెల్లుబాటు అవుతాయని టాటా సంస్థ ప్రకటించింది. వీటిలో 2,000 యూనిట్లు...
Tiago EV | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ కొత్త ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్‌షోరూం ధర) గా ఉండనున్నది. మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే ఈ ధరలు చెల్లుబాటు అవుతాయని టాటా సంస్థ ప్రకటించింది. వీటిలో 2,000 యూనిట్లు ప్రస్తుతం ఉన్న టాటా ఈవీ యజమానులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. వచ్చే నెల 10 నుంచి బుకింగ్ ప్రారంభం కానున్నది.
టాటా మోటార్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో ఈవీని ఆవిష్కరించింది. దేశీయ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్లో ఇదే తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈవీ కారు కావడం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అక్టోబర్ 10 న టియాగో ఈవీ కార్ల బుకింగ్‌లను టాటా సంస్థ తెరువనున్నది. ఇప్పటికే నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ మాక్స్, నెక్సాన్ ఈవీ ప్రైమ్ మోడల్ కార్లతో టాటా మోటార్స్ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఏర్పాటు చేసుకున్నది. టియాగో ఈవీ ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందినది.
ప్రస్తుతం ఏడు రకాల ఈవీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని టాటా మోటార్స్ సంస్థ తెలిపింది. టియాగో ఈవీని రెండు బ్యాటరీల ప్యాక్‌లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి టియాగో ఈవీకి మార్కెట్లో ఇతర సంస్థల నుంచి ఎలాంటి పోటీ కనిపించడం లేదు. టాటా మోటార్స్ టైగోర్ ఈవీతోనే పరోక్షంగా తలపడనున్నది. డిజైన్ పరంగా చూస్తే గత మోడల్స్‌లో కొన్ని మెరుగులు చేసినట్లు తెలుస్తున్నది. ముందువైపు గ్రిల్ సవరించారు. గ్రిల్‌పై ఈవీ బ్యాడ్జ్ ఉంచారు. గ్రిల్ కింద ఉన్న ట్రిమ్ హైలైట్ ఇప్పుడు నీలం రంగులో ఉన్నది. అలాగే, ఫ్రంట్ బంపర్ సెంట్రల్ ఎయిర్-వెంట్ కోసం ట్రై-బాణం నమూనాను ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

