Tata- Voltas | టాటా గ్రూప్ బ్రాండ్ అంటే ఓ గుర్తింపు.. ఆ కంపెనీ.. విమాన సర్వీసులు.. సాఫ్ట్ వేర్.. సాల్ట్.. వాటర్.. ఆతిథ్య రంగాల్లో సేవలందిస్తోంది. అందులో భాగంగానే హోం అప్లియెన్సెస్ సంస్థ ‘వోల్టాస్’ కూడా టాటా గ్రూప్ అనుబంధ సంస్థే. ప్రస్తుత పోటీ మార్కెట్లో నెలకొన్న ఇబ్బందుల నేపథ్యంలో హోం అప్లియెన్సెస్ విభాగం ‘వోల్టాస్’ విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టాటా గ్రూప్ వర్గాలు తెలిపాయి.
వోల్టాస్’ జాయింట్ వెంచర్లో భాగంగా ఉన్న స్థానిక సంస్థ ‘ఆర్కేలిక్ ఏఎస్’ను కూడా విక్రయిస్తుందా.. లేదా.. అన్నది తెలియ రాలేదు. అయితే, వోల్టాస్ విక్రయం కోసం చర్చలు జరుపుతున్నదని ఆ టాటా గ్రూప్ వర్గాల కథనం. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, సుదీర్ఘ కాలం కొనసాగే ఈ బిజినెస్’ను కొనసాగించే అవకాశాల్లేకపోలేదని కూడా ఆ వర్గాల కథనం. ఈ అంశంపై స్పందించడానికి టాటా గ్రూప్ ప్రతినిధి నిరాకరించారు.
ఏడాది కాలంగా వోల్టాస్ షేర్లు మూడు శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 330 కోట్ల డాలర్లు ఉంటుంది. 1954లో ఏర్పాటైన వోల్టాస్.. ఎయిర్ కండీషనర్లు, వాటర్ కూలర్లు, కమర్షియల్ రిఫ్రిజిరేటర్లు తయారు చేస్తోంది. భారత్ తోపాటు మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. ఆర్కెలిక్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కలిగి ఉన్న వోల్టాస్.. దేశీయంగా ‘వోల్టాస్ బెకో` బ్రాండ్ కింద పలు హోం అప్లియెన్సెస్ ఉత్పత్తులు విక్రయిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 9,677 కోట్ల ఆదాయం సంపాదించింది.