Credit Card | ప్లాన్ ప్రకారం వాడుకుంటే.. క్రెడిట్ కార్డుతో బోల్డు బెనిఫిట్లు..!
Credit Card | ప్లాన్ ప్రకారం కుటుంబ అవసరాలను బట్టి క్రమశిక్షణతో వాడుకుంటే క్రెడిట్ కార్డులపై వచ్చే బెనిఫిట్లను పూర్తిగా వినియోగించుకోవచ్చు.
Credit Card | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద ఓ క్రెడిట్ కార్డు ఉంటున్నది. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే.. రోజువారీగా కుటుంబ అవసరాల కొనుగోళ్లపై నెలకోసారి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మాత్రమే కాదు.. రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు.. పలు రకాల బెనిఫిట్లు అందిస్తున్నాయి క్రెడిట్ కార్డులు. కనుక ప్రతి ఒక్కరూ తమ కుటుంబ అవసరాలకు సరిపడే క్రెడిట్ కార్డు ఎంచుకోవడం చాలా మంచిదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు జారీకి ఇవీ అర్హతలు
ఇన్‌కం, సిబిల్ స్కోర్ ఆధారంగానే ప్రతి వ్యక్తి క్రెడిట్ కార్డు పొందుతారా? లేదా? అన్న సంగతి తేలి పోతుంది. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అర్హతలను బట్టి మీకు వచ్చే క్రెడిట్ కార్డుపై ఎంత లిమిట్ వస్తుందో చూసుకోవాలి. తొలుత సాధారణ క్రెడిట్ కార్డు పొందడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అధిక లిమిట్ గల క్రెడిట్ కార్డు కోసం ఎదురుచూస్తే తిరస్కరణకు గురి కావచ్చు.. మీ సిబిల్ స్కోర్ మీదా ప్రతికూల ప్రభావం పడుతుంది.
వాడకానికి అనుగుణంగా క్రెడిట్ కార్డులు
మీరు మోటార్ బైక్ ఎక్కువగా వాడుతుంటారా.. అయితే, క్రెడిట్ కార్డుపై పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ నింపుకుంటే క్యాష్ బ్యాక్, ఎక్కువ రివార్డు పాయింట్లు వచ్చే క్రెడిట్ కార్డును తీసుకునే అంశాన్ని పరిశీలించాలి. ఎక్కువగా ఆన్ లైన్ కొనుగోళ్లు జరిపే వారు.. షాపింగ్ వెబ్సైట్లు, బ్రాండ్లపై డిస్కౌంట్లు ఇచ్చే కార్డు తీసుకోవడంతో బెనిఫిట్ పొందొచ్చు. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ వంటి బెనిఫిట్లు ఎలా పొందొచ్చు అనే సంగతి తెలుసుకోవడానికి కార్డు నిబంధనలను క్షుణ్ణంగా చదివిన తర్వాత.. పూర్తి అవగాహనతో దాన్ని వినియోగించడానికి వీలవుతుంది.
50 శాతం లోపే క్రెడిట్ కార్డు వాడకం బెస్ట్
క్రెడిట్ కార్డు వాడకంపై గరిష్ట పరిమితి ఉండేలా చూసుకోవాలి. ఆదాయం, సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డు లిమిట్ ఖరారు చేస్తాయి. అయితే, క్రెడిట్ కార్డు లిమిట్ మేరకు మొత్తం వినియోగించడం కూడా అంత మంచిది కాదు. ఎప్పుడైనా లిమిట్లో 50 శాతం లోపే వినియోగించాలి. మిగతా 50 శాతం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో.. ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలతో దవాఖానల్లో చేరినప్పుడు వాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ప్రతి నెలా మీ ఆదాయం ఖర్చుపై బడ్జెట్ వేసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డు వాడకంపైనా ఒక ప్లాన్ రూపొందించుకోవాలి. ఏదైనా వస్తువు కొంటే 10 శాతం రాయితీ వస్తుందని అనుకుంటే.. క్యాష్ బదులు క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించాలి.
క్రమశిక్షణతోనే క్రెడిట్ కార్డు బెనిఫిట్లు
ఏడాదిలో నిర్దిష్ట మొత్తం ఖర్చు చేసినప్పుడు సంబంధిత క్రెడిట్ కార్డుపై కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజు వసూలు చేయడం లేదు. అలాగే, క్రెడిట్ కార్డు వాడకానికి అనుగుణంగా గడువు లోపే బిల్లు పే చేయాలి. క్రమశిక్షణ పాటించినప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు వల్ల లభించే బెనిఫిట్లను పూర్తిగా వినియోగించుకోవచ్చునని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

