Rs 2000 Exchange | రూ.2000 నోట్ల మార్పిడిపై బ్యాంకుల సొంత నిబంధనలతో కన్ఫ్యూజన్..!
Rs 2000 Exchange | రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లపై బ్యాంకులు సొంత మార్గదర్శకాలు, నిబంధనలు అమలు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది.
Rs 2000 Exchange | మార్కెట్లో చలామణి నుంచి రూ.2000 కరెన్సీ నోటు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ గత శుక్రవారం ప్రకటించింది. మంగళవారం నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ గానీ, మార్పిడి చేసుకోవచ్చునని తెలిపింది. అయితే తొలి రోజు బ్యాంకుల వద్ద రూ.2000 నోట్ల మార్పిడికి వచ్చిన ఖాతాదారులు, పౌరులు, బ్యాంకర్ల మధ్య గందరగోళం నెలకొంది. ఎటువంటి గుర్తింపు కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ తేల్చి చెప్పినా.. ఎస్బీఐ వంటి అతిపెద్ద బ్యాంకు నోటిఫికేషన్ జారీ చేసినా.. కొన్ని బ్యాంకులు విడిగా మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తున్నది. ఆధార్ లేదా పాన్ కార్డు సమర్పించాలని, నిర్దిష్ట ఫామ్ నింపాలని బ్యాంకర్లు సూచించారు. కొన్ని బ్యాంకుల చిన్న శాఖల వద్ద కొద్ది పాటి క్యూలైన్లలో ఖాతాదారులు నిలబడటం కనిపించింది.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా రూల్స్
కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్ఎస్బీసీ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు నాన్ అకౌంట్ హోల్డర్ల గుర్తింపు కార్డులు సమర్పించాలని, ఒక ఫామ్ నింపాలని కోరాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు రూ.2000 కరెన్సీ నోట్లు డిపాజిట్ చేయడానికి ఖాతాదారులను ఫామ్ నింపాలని సూచించాయి. ఇతరులను గుర్తింపు కార్డులు సమర్పించాలని స్పష్టం చేశాయి. యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, యస్ బ్యాంకు, కెనరాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వంటి బ్యాంకులు ఐడీ ఫ్రూప్ లేకుండానే నగదు మార్పిడికి అనుమతించాయి.
నోట్ల మార్పిడికి బదులు డిపాజిట్లకు ప్రోత్సాహం
కొన్నిబ్యాంకులు రూ.2000 నోట్ల మార్పిడికి ఎలక్ట్రానిక్ ఎంట్రీ నిబంధన పాటించాయి. మరి కొన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న రిజిస్టర్లలో సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్లు, పేరు నమోదు చేయించాయి. కొన్ని బ్యాంకులు నగదు మార్పిడికి బదులు డిపాజిట్లను ప్రోత్సహించాయని కస్టమర్లు చెప్పారు.
రూ.2000 నోటు మార్పిడికి 131 రోజుల గడువు
2016 నవంబర్ 8 రాత్రి తక్షణం నాటి పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దేశ కరెన్సీలో 86 శాతం తక్షణం చెల్లవని తేల్చి చెప్పడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. కానీ, రూ.2000 నోటు మార్పిడి లేదా డిపాజిట్‌కు 131 రోజుల గడువు ఇవ్వడంతో ప్రజల్లో అంతగా ఆందోళన కనిపించలేదు. రూ.2000 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటవుతుందని కూడా ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. రూ.50 వేలు దాటిన డిపాజిట్లకు పాన్ కార్డు సమర్పించాలన్న పాత నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

