ప్రైవేట్ బ్యాంకులు పడేశాయ్..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా క్షీణించాయి. గత వారం చివర్లో వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. ఈ వారం మాత్రం నష్టాలతో మొదలయ్యాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థల విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ షేర్లను మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మేశారు మరి.
- సెన్సెక్స్ 876, నిఫ్టీ 257 పాయింట్లు డౌన్
- ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై, అక్టోబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా క్షీణించాయి. గత వారం చివర్లో వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. ఈ వారం మాత్రం నష్టాలతో మొదలయ్యాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థల విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ షేర్లను మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మేశారు మరి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో సదరు బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే కారణమని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, పెరిగిన ముడి చమురు ధరలూ పెట్టుబడుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 876.37 పాయింట్లు లేదా 1.17 శాతం దిగజారి 73,852.90 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,020.73 పాయింట్లు కోల్పోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ 257.20 పాయింట్లు లేదా 1.11 శాతం పతనమై 22,888.95 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 3.85 శాతం పడిపోయింది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ వాల్యూ 2 శాతానికిపైగా నష్టపోయింది.
వచ్చే నెల 8న మూరత్ ట్రేడింగ్
దీపావళిని పురస్కరించుకుని వచ్చే నెల 8 (ఆదివారం)న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం 2:20 నుంచి 3:30 వరకు దీన్ని నిర్వహించనున్నారు. అయితే దీని కంటే ముందు 15 నిమిషాలపాటు 2:05 నుంచి 2:20 వరకు ప్రీ-ఓపెనింగ్ సెషన్ ఉంటుందని స్టాక్ ఎక్సేంజీలు ప్రకటించాయి. ట్రేడింగ్ సభ్యులకు మధ్యా హ్నం 1:15 నుంచి 1:50 మధ్య లాగింగ్‌కు అనుమతిస్తారు. 1:50 నుంచి 2:05 వరకు బ్లాక్ డీల్ విండో ఉంటుంది. కాగా, ఏటా దీపావళికి కొత్త హిందూ క్యాలెండర్ ఇయర్ మొదలవుతుందన్న విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకునే ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను జరుపడం ఆనవాయితీగా వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

