ఎస్బీఐ రుణాలు ప్రియం

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలు మరింత భారం కానున్నాయి. అన్ని రకాల రుణాలకు ప్రామాణికమైన బేస్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుతూ ఎస్బీఐ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. పెంపుతర్వాత బేస్ రేట్ 7.55 శాతానికి చేరింది. దీంతో గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలన్నీ కాస్త భారమవుతాయి. ఇటీవలి రిజర్వ్‌బ్యాంక్ పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై మార్పులేవీ చేయకపోయినా, ఈ ప్రభుత్వ బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం. మరోవైపు ఎస్బీఐ రూ.2 కోట్లు పైబడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

