Rupee | రూపాయి గింగిరాలు.. మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గింగిరాలు తిరుగుతున్నది. డాలర్ ముందు ఏమాత్రం నిలువలేక భారతీయ కరెన్సీ అంతకంతకూ చతికిలపడిపోతున్నది మరి. సోమవారం మరో 12 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 84.72 వద్దకు పతనమైంది.
- 12 పైసలు దిగజారి 84.72 వద్దకు క్షీణత
Rupee | ముంబై, డిసెంబర్ 2: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గింగిరాలు తిరుగుతున్నది. డాలర్ ముందు ఏమాత్రం నిలువలేక భారతీయ కరెన్సీ అంతకంతకూ చతికిలపడిపోతున్నది మరి. సోమవారం మరో 12 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 84.72 వద్దకు పతనమైంది. అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగి బలపడటం, దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలు జీడీపీ గణాంకాలతో రావడం దెబ్బతీసింది. నిజానికి ఉదయం ఆరంభంలో రూపాయి పెరుగుతున్నట్టు కనిపించినా.. ఆఖరుకు నిరాశే మిగిలింది.
ట్రంప్ సెగ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర్నుంచి కరెన్సీ మార్కెట్లో డాలర్ పరుగులు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీల పతనం కూడా ఆరంభమైంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని అన్ని కరెన్సీల విలువ క్రమేణా పడిపోతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు గుర్తుచేస్తున్నారు. ఇక బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల కరెన్సీలూ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయని చెప్తున్నారు. బ్రిక్ సభ్య దేశాలపై 100 శాతం సుంకాల పెంపు ఉంటుందని ట్రంప్ హెచ్చరించడమే కారణం.
4 రోజుల్లో..
వరుసగా గత 4 రోజుల్లో జరిగిన ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏకంగా 43 పైసలు కోల్పోవడం గమనార్హం. శుక్రవారం 13 పైసలు పడిపోగా, అంతకుముందు రెండు రోజులు 7 పైసలు, 11 పైసలు చొప్పున నష్టపోయింది. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. దాదాపు గత రెండు నెలల్లో దేశంలోని ఫారెక్స్ నిల్వలు సుమారు 50 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయాయి.
ప్రమాద ఘంటికలు
ఓవైపు దేశ జీడీపీ పతనం.. మరోవైపు రూపాయి విలువ క్షీణత.. ఇంకోవైపు పెట్టుబడుల ఉపసంహరణలు.. కలిసి ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నాయి. నానాటికీ పడిపోతున్న రూపాయి విలువ.. దేశీయ దిగుమతుల్ని భారం చేస్తుండగా.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిల్లో ఉంచుతున్నది. ఇప్పుడు రూపీ తీరు.. ఇకపైనా వడ్డీరేట్ల కోతలకు వీల్లేకుండా చేస్తున్నది. ఇదే జరిగితే కీలక రంగాల్లో వృద్ధి పడిపోవడం ఖాయం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

