1,000కి 53లక్షలు
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదలైన 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయిన ఈ పబ్లిక్ ఇష్యూ.. మదుపర్ల నుంచి విశేష స్పందన రావడంతో 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయిన విషయం తెలిసిందే. ఇలా భారతీయ స్టాక్ మార్కెట్లలో పాత రికార్డుల్ని ఎన్నింటినో చెరిపేసిన జియో.. మరెన్నో కొత్త రికార్డుల్ని సృష్టించిన సంగతీ విదితమే.
- జియోకే కాదు.. రిలయన్స్ ఐపీవోకూ భలే క్రేజ్
- 49 ఏండ్లలో 5,300 రెట్లు పెరిగిన పెట్టుబడులు
ముంబై, అక్టోబర్ 27: జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదలైన 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయిన ఈ పబ్లిక్ ఇష్యూ.. మదుపర్ల నుంచి విశేష స్పందన రావడంతో 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయిన విషయం తెలిసిందే. ఇలా భారతీయ స్టాక్ మార్కెట్లలో పాత రికార్డుల్ని ఎన్నింటినో చెరిపేసిన జియో.. మరెన్నో కొత్త రికార్డుల్ని సృష్టించిన సంగతీ విదితమే.
అయితే రిలయన్స్ గ్రూప్ సంస్థకు ఐపీవోలలో ఇన్వెస్టర్ల నుంచి ఇంతలా డిమాం డ్ రావడం ఇది తొలిసారేమీ కాదు. జియో మాతృ సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పబ్లిక్ ఇష్యూకూ మదుపర్ల నుంచి ఇలాగే ఆదరణ వచ్చింది మరి. అవును.. 49 ఏండ్ల క్రితం పెట్టిన ప్రతి వెయ్యి రూపాయల విలువ.. ఇప్పుడు రూ.53 లక్షలుగా ఉందంటే ఆర్ఐఎల్ షేర్లకు లభిస్తున్న గిరాకీ ఏ రేంజ్లో ఉంటున్నదో అర్థం చేసుకోవచ్చు.
1977 నవంబర్‌లో..
అది 1977 నవంబర్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల గురించి పెద్దగా ఎవరికీ తెలిసిన రోజులు కావు. కానీ ఐపీవోకు వచ్చిన రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చరిత్ర సృషించింది. 7 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయింది.
- రూ.10 ముఖ విలువతో 28.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టి మదుపర్ల నుంచి సుమారు రూ.2.82 కోట్లను కంపెనీ సమీకరించింది.
- స్టాక్ మార్కెట్లో నమోదైన రోజునే ఒక్కో షేర్ విలువ రూ.7-8 పెరిగింది. దాదాపు రూ.17-18గా షేర్ లిస్ట్ అయింది. దీంతో తొలి రోజే మదుపర్లకు 70-80 శాతం లాభాలు అందాయి.
- తర్వాత రోజుల్లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కాస్తా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా మారింది. నాటి నుంచి నేటి వరకు చమురు శుద్ధి, పెట్రో కెమికల్స్, రిటైల్, టెలికాం అంటూ ఎన్నో కొత్త వ్యాపారాల్లోకి విస్తరిస్తూపోయింది.
- విస్తరణలు, విభజనల నేపథ్యంలో 1977లో రూ.1,000తో కొన్న 100 షేర్ల విలువ.. ఇప్పుడు సుమారు రూ.53 లక్షలు పలుకుతున్నది. ఈ 49 ఏండ్లలో 5,300 రెట్లు పెరుగడం విశేషం.
- ఆర్ఐఎల్ ఇప్పటిదాకా 6 బోనస్‌లను జారీ చేసింది. చివరిసారిగా 2024లో 1:1 బోనస్ ప్రకటించింది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 12 సంస్థలు స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి.
పడుతూ.. లేస్తూ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లలో అనేక ఒడిదుడుకులకు లోనయ్యాయి మరి.
- 2006లో రిలయన్స్ గ్రూప్ అధినేత ధీరూబాయ్ అంబానీ వారసులుగా ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య కుటుంబ ఆస్తుల విభజన జరిగింది. ముకేశ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కింది. చమురు, గ్యాస్, పెట్రో కెమికల్ వ్యాపారాలూ వచ్చాయి. అనిల్‌కు విద్యుత్తు, టెలికాం, ఆర్థిక, ఇతర కొత్త వ్యాపారాలు లభించాయి.
- విభజనతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న రిలయన్స్ షేర్లు.. 2008లో దారుణంగా పతనాన్ని చవిచూశాయి. ఒక్క ఏడాదే షేర్ విలువ 57 శాతానికిపైగా హరించుకుపోయింది.
- అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) భారత్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణలకు దిగారు. 2016 వరకు షేర్లు కోలుకోలేదు.
- 2016 సెప్టెంబర్‌లో జియోతో రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగు పెట్టడం మదుపర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
- 2017లో రిలయన్స్ షేర్లు 70 శాతానికి పైగా లాభాలను చూశాయి. గడిచిన పదేండ్లలో షేర్ వార్షిక చక్ర వృద్ధిరేటు 17 శాతంగా ఉన్నది.
జియో.. నెంబర్ 2?
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ షేర్లు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా జియో రికార్డు సృష్టించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుత గ్రే మార్కెట్ సంకేతాల ఆధారంగా జియో మార్కెట్ విలువ దాదాపు రూ.12.61 లక్షల కోట్లకు చేరవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత మార్కెట్ విలువ కంటే సుమారు రూ.25,700 కోట్లు ఎక్కువ. దీంతో ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత అత్యంత విలువైన సంస్థగా జియోనే అవతరించవచ్చని అంటున్నారు.
అయితే ఇది జరుగాలంటే జియో షేర్ విలువ రూ.1,342, అంతకంటే ఎక్కువ ధరతో మార్కెట్లో లిస్టింగై నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఐపీవో ప్రకారం జియో షేర్ విలువ గరిష్ఠంగా రూ.1,119గానే ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జియో షేర్లకు మదుపర్ల నుంచి వచ్చిన విశేష స్పందన దృష్ట్యా శని, సోమ, మంగళవారాల్లో అనధికార మార్కెట్లో ఎక్కువ ధరతో క్రయవిక్రయాలు జరిగి ఉండవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదే జరిగితే జియో.. నెంబర్ 2గా నిలబడటం ఖాయమంటున్నారు. ఇక మార్కెట్ విలువపరంగా జియో.. టాప్-5 కంపెనీల్లో చోటు దక్కించుకుంటే దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ ఆరో స్థానానికి పడిపోనున్నది. మంగళవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికైతే రూ.9.03 లక్షల కోట్లతో టీసీఎస్ టాప్-5 జాబితాలోనే ఉన్నది.
- జియో ఐపీవో నేపథ్యంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్.. మార్కెట్ క్యాపిటలైజేషన్లో దేశంలోనే అత్యంత విలువైన గ్రూప్‌గా నిలుస్తున్నది. రూ.27 లక్షల కోట్లను దాటిపోతున్నది.
- మంగళవారం నాటికి స్టాక్ మార్కెట్లలో నమోదైన మొత్తం 32 టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిసి దాదాపు రూ.25.7 లక్షల కోట్లుగానే ఉన్నది.
- 11 అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ.16.6 లక్షల కోట్లే.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

