Reign of Titans | గూగుల్ ప్లే స్టోర్.. ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లోకి రీన్ ఆఫ్ టైటాన్స్ ..!
Reign of Titans | ప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది.
Reign of Titans | ప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది. దీంతో స్ట్రాటర్జీ కార్డ్ బేస్డ్ ఆన్లైన్ గేమ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రీన్ టైటాన్ గేమ్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఆడవచ్చు. తక్కువ టెక్నికల్ రిక్వైర్మెంట్లతో గ్లోబల్ కాంపిటీషన్లలోనూ పాల్గొన వచ్చు. ‘భారత్‌పై రీన్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) ప్రభావం ఉంటుంది’ అని రీన్ ఆఫ్ టైటాన్స్ హెడ్ అది అబిలీ చెప్పారు. ‘యూజర్లకు మా గేమ్ బెస్ట్ వర్షన్ అందించడానికి మేం గణనీయ సమయం కేటాయించడంతోపాటు కృషి చేశాం. ఈ-స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాలని భావించే ఆటగాళ్లకు కొత్త అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఒక్కరికీ సరదా అందిస్తుంది’అని అన్నారు. రీన్ ఆఫ్ టైటాన్స్ తన ప్లేయర్లను ఆధ్యాత్మికమైన, మనోహరమైన ప్రదేశం ‘ఎరియో’కు తీసుకెళుతుంది.
ప్లేయర్లు లేదా క్యోక్స్ గేమ్‌లోకి ఎంటరయ్యే ముందు ఎనిమిది ఎలిమెంట్స్‌లో ఒక టైటాన్‌ను ఎంచుకుని తమ డెక్ స్క్రోల్స్ నిర్మించుకుని ఎరినా వైపు దూసుకెళ్తారు. ఈ రియల్‌టైం 1వర్సెస్ 1 మ్యాచెస్‌లో ఆటగాళ్లు తమ టైటాన్ ఎనర్జీని సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గేమ్‌లో రెండు మార్గాల్లో విజయం సాధించొచ్చు. ప్రత్యర్థిని క్షీణింపజేసి గానీ, వారిని స్క్రోల్స్ నుంచి రన్ఔట్ అయ్యేలా చేసి గానీ విజయం సాధించొచ్చు. రీన్ ఆఫ్ టైటాన్స్ గేమ్ దేశంలో కొత్త కాదు. కాలేజీలు, గేమింగ్ కేఫ్‌లు, టాప్ ఈ-స్పోర్ట్స్ అథ్లెట్లకు గతేడాదే అందుబాటులోకి తీసుకొచ్చింది రీన్ ఆఫ్ టైటాన్స్ టీం.
రీన్ ఆఫ్ టైటాన్స్ లో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎవరినైనా ఈ-స్పోర్ట్స్ ప్లేయర్ చేయడానికి, గ్లోబల్ లీడర్బోర్డులపైకి దూసుకెళ్లడానికి చాలా ఈజీగా ఉపకరిస్తాయి. ఆసక్తి గల ప్లేయర్లు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ ఆప్స్టోర్కెళ్లి రీన్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) యాప్ డౌన్‌లోన్ చేసుకుంటారు. దీంతో వారికి ఫస్ట్ టైటాన్ లభించడంతోపాటు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటారు. ‘వెల్కం లూట్ బాక్స్ (Welcome Loot Box)’ పట్ల కొత్త ప్లేయర్లు ఆసక్తిగా ఉంటారు. టైటాన్లో తమ వ్యూహం ఖరారు చేసుకునేందుకు కొత్త ప్రారంభం మొదలవుతుంది. భారత్‌లోని ఆటగాళ్లు రీన్ ఆఫ్ టైటాన్స్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి వెళ్లి వచ్చే ఈవెంట్లు, రీన్ ఆఫ్ టైటాన్స్ ప్రత్యక్ష ప్రసారం అనుభవాలు తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలేజీలు, నగరాల పరిధిలో ఈ గేమ్ యాక్టివేషన్ కొనసాగుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

