IIFL | బంగారం రుణాలపై నిషేధం.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ షాక్
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాల మంజూరీ, పంపిణీపై రిజర్వ్‌బ్యాంక్ నిషేధం విధించింది. ఆ కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో పర్యవేక్షణలో కొన్ని ఆందోళనలు తలెత్తడంతో తక్షణమే రుణ వితరణ నిలిపివేయాలంటూ ఆదేశించింది.
IIFL | ముంబై, మార్చి 4: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాల మంజూరీ, పంపిణీపై రిజర్వ్‌బ్యాంక్ నిషేధం విధించింది. ఆ కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో పర్యవేక్షణలో కొన్ని ఆందోళనలు తలెత్తడంతో తక్షణమే రుణ వితరణ నిలిపివేయాలంటూ ఆదేశించింది. అయితే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో వసూళ్లు, రికవరీ ప్రక్రియలను నిర్వహించుకోవచ్చని సోమవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
బంగారం రుణాల మంజూరీ సమయంలోనూ, డిఫాల్ట్ అయిన సందర్భంలో వేలం వేసేటపుడు కంపెనీ సర్టిఫై చేసే బంగారం స్వచ్ఛత, నికర బరువు తదితర అంశాలపై తీవ్రమైన వ్యత్యాసాలు తమ తనిఖీలో వెల్లడయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇవి ఖాతాదారుల ప్రయోజనాలకు భంగకరమని, తాము నిర్వహించే ప్రత్యేక ఆడిట్ పూర్తయిన తర్వాత నియంత్రణల్ని సమీక్షిస్తామని వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

