RBI | బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్ల నగదు విడుదల చేసిన ఆర్బీఐ.. కారణం ఏందంటే..!
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ (Banking System) లోకి భారీగా నగదును విడుదల చేసింది. ఏడు రోజుల వీఆర్ఆర్ (Variable Rate Repo) వేలం ద్వారా రూ.1.41 లక్షల కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసింది. జీఎస్టీ (GST) చెల్లింపుల కారణంగా వ్యవస్థలో ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది.
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ (Banking System) లోకి భారీగా నగదును విడుదల చేసింది. ఏడు రోజుల వీఆర్ఆర్ (Variable Rate Repo) వేలం ద్వారా రూ.1.41 లక్షల కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసింది. జీఎస్టీ (GST) చెల్లింపుల కారణంగా వ్యవస్థలో ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. ఇటీవలి జీఎస్టీ చెల్లింపుల వలన బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు బయటకు వెళ్లింది. దాంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత ఒక్కసారిగా పడిపోయింది.
జూన్ 21న రూ.30,685 కోట్ల మిగులుతో ఉన్న వ్యవస్థ జూన్ 22 నాటికి రూ.19,971 కోట్ల లోటుకు చేరుకుంది. ఈ పరిణామంతో స్వల్పకాలిక మనీ మార్కెట్ వడ్డీ రేట్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సగటు కాల్ మనీ రేటు 5.43 శాతానికి చేరింది. ఇది ఆర్బీఐ రెపో రేటు కన్నా 0.18 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్బీఐ, వ్యవస్థలో తగినంత నగదు ఉండేలా చర్యలు తీసుకుంది. 5.26 శాతం కటాఫ్ రేటుతో బ్యాంకులకు నిధులను అందించింది. ఇలాంటి సమయాల్లో ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే నిధుల సమీకరణ వ్యయం పెరిగి, ఆర్థిక వ్యవస్థలో రుణ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇది ఆర్థిక మందగమనానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఆర్బీఐ సాధారణంగా పన్ను చెల్లింపులు, ముందస్తు పన్ను చెల్లింపులు లేదా ఇతర కాలానుగుణ రుణ డిమాండ్ వంటి కారణాలవల్ల ఏర్పడే స్వల్పకాలిక నగదు లోటును సరిచేయడానికి వివిధ ద్రవ్య విధాన సాధనాలను ఉపయోగిస్తుంది. తాత్కాలిక నగదు అవసరాల కోసం వీఆర్ఆర్ వేలాలను నిర్వహిస్తుంది. దీనికింద బ్యాంకులు తమవద్ద ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి నిధులు పొందుతాయి. ఇక దీర్ఘకాలిక ద్రవ్య లభ్యత కోసం ఆర్బీఐ సెకండరీ మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం లేదా డాలర్-రూపాయి స్వాప్ వేలాలను నిర్వహించడం వంటి చర్యలు చేపడుతుంది. తాజా చర్యతో బ్యాంకింగ్ వ్యవస్థలో స్వల్పకాలిక నిధుల ఒత్తిడి తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

