RBI on Star Symbol Notes | స్టార్ సింబల్ నోట్లపై ఆర్బీఐ క్లారిటీ.. చెల్లుబాటవుతాయని స్పష్టీకరణ
RBI on Star Symbol Notes | స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావని, చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. పునర్ ముద్రించిన నోట్లను సులభంగా గుర్తించడానికే స్టార్ సింబల్ ముద్రించామని తెలిపింది.
RBI on Star Symbol Notes | కరెన్సీ నోట్లపై స్టార్ సింబల్ ముద్రించడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇవి నకిలీ నోట్లంటూ పలువురు పోస్టులు పెట్టడంతో ఈ అంశం వైరలైంది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. స్టార్ సింబల్‌తో ముద్రించిన నోట్లు నకిలీవి కాదని, అవి కూడా తాము జారీ చేసిన నోట్లేనని, చెల్లుబాటవుతాయని వివరణ ఇచ్చింది.
వివిధ రకాల నోట్లు ముద్రించే ఆర్బీఐ.. వాటిపై సీరియల్ నంబర్ ముద్రిస్తుంది. కానీ ఇటీవల కొన్ని నోట్లపై స్టార్ సింబల్ ముద్రించడాన్ని కొందరు గుర్తించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ప్రిఫిక్స్, సీరియల్ నంబర్ మధ్య ఈ స్టార్ సింబల్ ఉంటుందని, ఇతర నోట్ల మాదిరిగానే ఈ నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.
రీ ప్లేస్ చేసిన, పునర్ముద్రించిన నోట్లపై స్టార్ సింబల్ ముద్రించామని ఆర్బీఐ పేర్కొన్నది. వాటిని తేలిగ్గా గుర్తించడానికి ఈ స్టార్ సింబల్ ముద్రించామని పేర్కొంది. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా రియాక్టయింది. ఆ నోట్లు నకిలీ కాదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2016లో ఆర్బీఐ ముద్రించిన రూ.500 విలువైన నోట్లపైనా స్టార్ గుర్తు ఉందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

