31 నుంచి రైళ్ల రద్దు అబద్ధం: రైల్వేశాఖ

న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసులు రద్దయ్యాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను రైల్వే మంత్రిత్వశాఖ సోమవారం నిరాకరించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు పూర్తిగా నిరాధారం అని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల క్లిప్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని స్పష్టంచేసింది. ఈ వీడియో క్లిప్‌లు గతేడాది వార్తల్లో వచ్చినవేనని పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ పేరిట వివరణ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ నుంచి రైలు సర్వీసులు రద్దు చేశామని భారతీయ రైల్వేస్ ఏనాడు ప్రకటించలేదని తెలిపింది. ప్రస్తుతం స్పెషల్ రైళ్లుగా నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని వివరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

