Punjab National Bank | ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన..!
Punjab National Bank | ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్బీ వడ్డీ రేట్లను సవరించింది.
Punjab National Bank | ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్బీ వడ్డీ రేట్లను సవరించింది. ఐదు సంవత్సరాల తర్వాత ఈ నెల ఫిబ్రవరి 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50శాతం నుంచి 6.25శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత పీఎన్బీ వివిధ పథకాల కింద గృహ రుణాల రేటును 8.15శాతానికి సవరించింది. మార్చి 31, 2025 వరకు వినియోగదారులు ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీల పూర్తి మినహాయింపును పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. సాంప్రదాయ గృహరుణ పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి 8.15 శాతం నుంచి ప్రారంభమవుతుందని.. నెలవారీ వాయిదా లక్షకు రూ.744గా ఉంటుందని పేర్కొంది.
ఆటో రుణాలకు సంబంధించి.. కొత్త, పాత కార్ల ఫైనాన్సింగ్ కోసం వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.50 శాతం నుంచి మొదలవుతాయని.. లక్షకు రూ.1,240 వరకు ఈఎంఐ ఉంటుందని పేర్కొంది. వినియోగదారులకు 120 నెలల ఎక్కువ రీపేమెంట్ టర్మ్ ఉంటుందని.. ఎక్స్-షోరూమ్ ధరలో వందశాతం ఫైనాన్స్‌ను ఆస్వాదించవచ్చని పేర్కొంది. ఎడ్యుకేషన్ రుణాల విషయంలో కనీస కార్డ్ రేటును సంవత్సరానికి 7.85శాతం తగ్గించింది. వినియోగదారులు డిజిటల్ ప్రక్రియ ద్వారా రూ.20లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని పేర్కొంది. దీంతో బ్రాంచ్‌లు సందర్శించాల్సిన అవసరం ఉండదని.. పేపర్ వర్క్ సైతం ఉండదని చెప్పింది. సవరించిన రేట్లు 11.25శాతం నుంచి మొదలవుతాయని.. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్బీఐ పాలసీ రేటుకు అనుగుణంగా గృహ రుణాలతో సహా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు కోత విధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Pneumonia | న్యుమోనియా అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ENE Repeat | బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్ఈ రిపీట్’ దూకుడు.. తొలి రోజే రూ.15 కోట్ల వసూళ్లు!
Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
Cyclone Akvan | తీరం దాటిన తుపాను అక్వాన్.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

