Banks exams in Local languages| బ్యాంకు పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లోనే !
Banks exams in Local Launages | ఇక నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సిబ్బంది నియామక పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లోనే జరుగనున్నాయి.

Banks exams in Local Launages | ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ జరుగనున్నాయి. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు బ్యాంకు ఉద్యోగాలకు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు.
కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన కమిటీ సిఫారసు మేరకు ప్రాంతీయ భాషల్లో ప్రభుత్వ బ్యాంకుల సిబ్బంది నియామక పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక భాషల్లో పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదిస్తే, స్థానికులకు మెరుగైన సేవలందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీపీఎస్ వెల్లడించింది. దీని ప్రకారం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) సిబ్బంది నియామకం కోసం జరిగే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు 13 ప్రాంతీయ భాషల్లో జరుగుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీపీఎస్ తెలిపింది.
ఇప్పటికే ఎస్బీఐలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని ఐబీపీఎస్ ప్రకటన చేసింది. దాని ప్రకారం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. భవిష్యత్లో నిర్వహించే పరీక్షలకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ప్రాంతీయ భాషల్లో బ్యాంకు ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని వివిధ రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణ భారత రాష్ట్రాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

