Poco F6 Pro | గ్లోబల్ మార్కెట్లలో పోకో మిడ్ రేంజ్ ఫోన్ పోకో ఎఫ్6 ప్రో ఆవిష్కరణ..!
Poco F6 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 ప్రో సిరీస్ ఫోన్లను శుక్రవారం గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
Poco F6 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 ప్రో సిరీస్ ఫోన్లను శుక్రవారం గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఇందులో పోకో ఎఫ్6 ప్రో, పోకో ఎఫ్6 ఫోన్లు ఉన్నాయి. 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు డబ్ల్యూడీహెచ్డీ+ డిస్ ప్లేతో వస్తోంది ఫోన్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 16 జీబీ ర్యామ్ కెపాసిటీతో వస్తోంది. పోకో ఎఫ్6 ప్రో ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులోకి వస్తోంది. కేవలం 19 నిమిషాల్లో ఈ ఫోన్ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అవుతుంది. 50-మెగా పిక్సెల్ రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో రూపుదిద్దుకున్నదీ ఫోన్. రెడ్మీ కే70 గ్లోబల్ వర్షన్ పోకో ఎఫ్6 ప్రో ఫోన్.
పోకో ఎఫ్6 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.40 వేలు (449 యూరోలు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.46 వేలు (499 యూరోలు), టాప్ ఎండ్ వేరియంట్ 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.52 వేలు (579 యూరోలు) పలుకుతుంది. ఈ ధరలు కూడా ఎర్లీబడ్ ప్రైసెస్. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
పోకో ఎఫ్6 ప్రో ఫోన్ షియోమీ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ (1440×3200 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. హెచ్డీఆర్10+, డోల్బీ విజన్ కు ఈ డిస్ ప్లే మద్దతుగా ఉంటుంది. తడి చేతులతోనూ ఈ ఫోన్ ఆపరేట్ చేయొచ్చు. పోకో ఎఫ్6 ప్రో ఫోన్ ఓఐఎస్ మద్దతుతో 50-మెగా పిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 ఇమేజ్ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
పోకో ఎఫ్6 ప్రో ఫోన్ ఎన్ఎఫ్సీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ కంపాస్, గైరో స్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ఫ్లికర్ సెన్సర్ తదితర సెన్సర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

