Poco F6 5G | భారత్ మార్కెట్లో 23న పోకో ఎఫ్6 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Poco F6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎఫ్6 5జీ (Poco F6 5G) ఫోన్‌ను ఈ నెల 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Poco F6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎఫ్6 5జీ (Poco F6 5G) ఫోన్‌ను ఈ నెల 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్మీ టర్బో 3 ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎఫ్6 5జీ ఫోన్‌గా డిజైన్ చేశారని తెలుస్తోంది.
పోకో ఎఫ్6 5జీ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 1.5కే రిజొల్యూషన్‌తో 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుందీ ఫోన్. 90వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ విక్రయాలు జరుగుతాయి.
50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 మెయిన్ రేర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 20-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. ఐస్ టైటానియం, గ్రీన్ బ్లేడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. గత నెలలో ఆవిష్కరించిన రెడ్మీ టర్బో 3 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (1999 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.26,450 (2299 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.28 వేలు (2499 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.32 వేలు (2799 చైనా యువాన్లు) పలుకుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

