PIB Fact Check – India Post SMS scam | ఇండియా పోస్ట్ పార్శిల్ పేరిట లింక్‌లు.. సేఫ్‌గా ఉండాలంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అలర్ట్..!
PIB Fact Check - India Post SMS scam | ఇండియా పోస్ట్ నుంచి పార్శిల్ వచ్చిందని, అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయొద్దని ప్రజలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అలర్ట్ చేసింది.
PIB Fact Check – India Post SMS scam | అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తున్నారు. ఇండియా పోస్ట్ పేరిట లింక్‌లు డబ్బు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఈ మోసపూరిత లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరిస్తూ తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.
‘పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా మీకో పార్సి్ల్ వచ్చింది. డెలివరీ చేయడానికి రెండు సార్లు ట్రై చేశాం. అడ్రస్ సరిగ్గా లేక సాధ్యం కాలేదు. 48 గంటల్లో చిరునామా అప్ డేట్ చేసుకోండి. అలా అడ్రస్ అప్ డేట్ చేసుకోకుంటే పార్సిల్ వెనక్కి వెళ్లిపోతుంది’ అని కొందరికి సైబర్ మోసగాళ్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. అడ్రస్ అప్ డేట్ కోసం లింక్ ఇచ్చి.. అప్ డేట్ చేసుకుంటే 24 గంటల్లోనే పార్శిల్ డెలివరీ చేస్తాం’ అని ఆ ఎస్ఎంఎస్ చెబుతుంది.
ఈ మెసేజ్ అచ్చం తపాలా శాఖ పంపినట్లే ఉంటది. ఆ లింక్ తోపాటు వచ్చే యూఆర్ఎల్ ఇండియా పోస్ట్ వెబ్ సైట్ మాదిరే ఉంటుంది. తమకు ఎవరో పార్శిల్ పంపి ఉంటారని ఆ లింక్ క్లిక్ చేస్తే సైబర్ మోసగాళ్ల వలలో పడ్డట్లే. లింక్ క్లిక్ చేస్తే ఇండియా పోస్ట్ వంటి వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ట్రాకింగ్ ఐడీ చెక్ చేస్తే డెలివరీ ఫెయిల్యూర్ అనే మెసేజ్ కనిపిస్తుంది. అటుపై అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని సందేశం పంపుతూనే సైబర్ మోసగాళ్లు.. మీ ఫోన్ లోకి ఫ్రాడ్ సాఫ్ట్ వేర్ పంపి.. దాన్ని తమ ఆధీనంలోకి తీసేసుకుంటారు. ఆ పై మీ ఖాతా వివరాలు తెలుసుకుని మనీ స్వాహా చేస్తారు.
కనుక సైబర్ మోసగాళ్లు పంపే ఈ లింకుల్ని క్లిక్ చేయొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం కోరుతూ అడిగే లింకుల్ని ఏ పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా పార్శిల్ వచ్చిందా.. లేదా..? అన్న సంగతి తెలుసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సూచించింది. ఒకవేళ పొరపాటున ఆ లింక్ క్లిక్ చేసి మోసపోతే వెంటనే 1930 నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని ప్రజలకు హితవు చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

