Bank Holidays in January | కొత్త ఏడాది బ్యాంకు దినాలు 15 రోజులే
Bank Holidays in January | కొత్త వసంతం తొలి సంవత్సరంలో మొదటి నెలలో బ్యాంకులు కేవలం 15 రోజులే పని చేస్తాయి.

Bank Holidays in January మరో ఐదు రోజుల్లో 2021కి గుడ్‌బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరిలో లావాదేవీల కోసం బ్యాంకుకెళ్తున్నారా.. అయితే, బ్యాంకులు ఏ రోజుల్లో పని చేస్తాయి.. ఏ రోజు పని చేయవ్.. అనే అంశం ముందుగా తెలుసుకోవాలి. ఐదు ఆదివారాలు, రెండు శనివారాలతో కలిపి 16 రోజులు బ్యాంకులకు సెలవులని ఆర్బీఐ ఖరారు చేసింది. దేశంలోని వివిధ పండుగలు, వేడుకల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యధిక రాష్ట్రాల్లో సెలవు ఇస్తారు. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం అగర్తల, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, గువాహటి, కోచి, శ్రీనగర్ పట్టణాల్లో రిపబ్లిక్‌డేను సెలవు దినంగా పరిగణించరు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం జనవరిలో బ్యాంకులు పని చేసేది 15 రోజులే. బ్యాంకులకు ఆర్బీఐ ప్రకటించిన సెలవుల వివరాలు తెలుసుకుందాం..
జనవరి 1, 2022 : నూతన సంవత్సరాది
3 : సిక్కింలో లొసూంగ్ (నూతన వసంత సంబురాలు)
4: లూసంగ్ సెలవు
11: మిషనరీ డే
12: స్వామి వివేకానంద జయంతి
14: మకర సంక్రాంతి/ పొంగల్
15: మకర సంక్రాంతి పండుగ/ మాఘే సంక్రాంతి/ సంక్రాంతి/ పొంగల్/ తిరువల్లువార్ దినోత్సవం
18: తమిళనాడులో థాయి పూసం
26: రిపబ్లిక్ డే
జనవరి 1న.. ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌ల్లో. 3న ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, 4న గ్యాంగ్‌టక్, 11న ఐజ్వాల్, 12న కోల్‌కతాలోని బ్యాంకులు పని చేయవు. మకర సంక్రాంతి, పొంగల్ సందర్భంగా అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో మూసి ఉంటాయి. 15న ఉత్తరాయణ పుణ్యకాల సంక్రాంతి పండుగల సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌ల్లో సెలవు. 18న తాయిపూసం వేడుక కోసం చెన్నై నగర బ్యాంకు శాఖలకు సెలవు.
జనవరిలో వారాంతపు సెలవులు:
2, 9, 16, 23, 30.. ఆదివారాలు
8,22 రెండవ, నాల్గవ శనివారం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

