OnePlus 12 | రేపు భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ 12 ఫోన్.. ధరెంతంటే..?!
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్.. వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్.. వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నెల 30 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. 100 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, క్వా్ల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్నది. వన్‌ప్లస్ 12 ఫోన్ 12 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.64,999, 16 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.69,999 పలుకుతాయని తెలుస్తోంది.
ఇక వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్ల విక్రయాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం జరిగే ‘స్మూత్ బియాండ్ బిలీఫ్’ అనే ఈవెంట్ వేదికగా వన్‌ప్లస్12, వన్‌ప్లస్12ఆర్ ఫోన్లు ఆవిష్కరిస్తారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా మాత్రమే ఈ ఫోన్లు లభిస్తాయి. వన్‌ప్లస్12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్14 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ (1440×3618 పిక్సెల్స్) ఎల్టీపీఓ ఓలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుందీ ఫోన్. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది.
వన్‌ప్లస్ 12 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ ఎల్వైటీ-808 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) హసెల్బ్లేడ్ ట్యూన్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటది. ఈ ఫోన్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. 100వాట్ల సూపర్ వూక్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

