SBI ATM Card | ఆ పరిస్థితుల్లో ఏటీఎం కార్డు ఆటోమేటిక్‌గా ఇవ్వలేం.. తేల్చేసిన ఎస్బీఐ!
SBI ATM Card | గడువు పూర్తయిన డెబిట్ కార్డు స్థానంలో కొత్త ఏటీెఎం కార్డు జారీ చేసే విషయమై ఎస్బీఐ నిబంధనలు మార్చేసింది. కనీసం ఏడాదికోసారి డెబిట్ కార్డు వాడాలని లేని పక్షంలో సంబంధిత ఖాతాదారు.. బ్యాంకు శాఖలో సంప్రదించాలని సూచించింది.
SBI ATM Card | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తుంటారు. ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులు నగదు డిపాజిట్, విత్ డ్రాయల్స్ కోసం ఏటీఎం కార్డు జారీ చేస్తుంటాయి. ఆ ఏటీఎం కార్డులకు నిర్దిష్ట గడువు ఉంటుంది. ఆ గడువు దాటే లోపు సంబంధిత బ్యాంకు.. తమ ఖాతాదారుకు కొత్త డెబిట్ కం ఏటీఎం కార్డు జారీ చేస్తుంది. కానీ, ఓ ఖాతాదారుడికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నుంచి భిన్నమైన అనుభవం ఎదురైంది.
పదేండ్లుగా ఎస్బీఐ ఖాతాదారుగా ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదిక `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`తో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. పదేండ్లుగా ఎస్బీఐ ఖాతాదారుడిగా ఉన్నా.. ఇటీవలే గడువు ముగిసిన డెబిట్ కార్డు స్థానంలో తన అడ్రస్‌కి కొత్త డెబిట్ కార్డు జారీ చేయలేదని తెలిపాడు. దీనిపై ఎస్బీఐ అధికారులను అడిగితే బ్యాంకు శాఖను సంప్రదించాలని సూచించారన్నాడు.
ఎస్బీఐ.. ఇప్పటి వరకూ గడువు ముగియడానికి మూడు నెలల ముందు ఆటోమేటిక్‌గా వారి డెబిట్ కార్డును వారి రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపుతూ వచ్చింది. కానీ, తాజాగా ఖాతాదారులకు గడువు పూర్తయిన డెబిట్ కార్డు స్థానంలో కొత్త డెబిట్ కార్డు జారీ చేయడానికి నిబంధనలు మార్చేసింది.
సోషల్ మీడియా వేదిక `ఎక్స్` వేదికగా పోస్ట్ పెట్టిన ఖాతాదారుడికి ఎస్బీఐ రిప్లయ్ ఇచ్చింది. సదరు ఖాతాదారుడు తన ఖాతాకు పాన్‌కార్డును అనుసంధానించాలని ఎస్బీఐ తెలిపింది. గత 12 నెలల్లో ఒక్కసారైనా ఖాతాదారు తన ఏటీఎం కార్డు ఉపయోగించి నగదు విత్‌డ్రా చేయాలి. ఈ నిబంధనలు పాటించకపోతే సంబంధిత ఖాతాదారు బ్యాంకు శాఖను సంప్రదించి.. నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాలను సమర్పించాలి. అటుపై కొత్త డెబిట్ లేదా ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

