Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనం, హైడ్రోజన్‌పై ఆధారపడి ఉంటుందని గడ్కరీ వివరించారు.
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనం, హైడ్రోజన్‌పై ఆధారపడి ఉంటుందని గడ్కరీ వివరించారు. హైడ్రోజన్ రోడ్డు రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రైల్వే, విమానయాన రంగంలో ఉపయోగించనున్నట్లు చెప్పారు. రైళ్లు హైడ్రోజన్‌తో నడుస్తాయని.. విమానాలు హైడ్రోజన్‌తోనే ఎగురుతాయన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక అంతమవుతుందన్నారు. భారతదేశం ఇటీవల జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమేకర్‌గా అవతరించింది. అమెరికా ఆటో పరిశ్రమ విలువ దాదాపు రూ.78 లక్షల కోట్లు, చైనా విలువ రూ.49 లక్షల కోట్లు. భారతదేశం విలువ రూ.22 లక్షల కోట్లు అని గడ్కరీ చెప్పారు.
కొద్దిరోజుల కిందట మెర్సిడెస్ గ్లోబల్ చైర్మన్ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ మెర్సిడెస్ కార్లను తయారు చేస్తుందని తనతో చెప్పారని ఆయన అన్నారు. విద్యుత్, బయో ఇంధనం, హైడ్రోజన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున అవలంబిస్తే, భారతదేశం కార్బన్ న్యూట్రాలిటీ వైపు వేగంగా అడుగులు వేయడమే కాకుండా ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణాన్ని కాపాడడం, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని గడ్కరీ చెప్పారు. నేడు హైడ్రోజన్ ధర కిలోకు 5-6 డాలర్లు ఉందని గడ్కరీ చెప్పారు. కానీ, దాన్ని కిలోకు డాలర్‌కు తగ్గిస్తే భారతదేశం చమురు ఉత్పత్తి చేసే దేశాల హోదాను కూడా సాధించగలదన్నారు. దాంతో భారతదేశాన్ని ఇంధన దిగుమతి చేసుకునే దేశం నుంచి ఇంధన ఎగుమతి చేసే దేశంగా మార్చవచ్చన్నారు. హైడ్రోజన్‌ను స్వీకరించడంలో అతిపెద్ద సమస్య ఫిల్లింగ్ స్టేషన్లు, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయడమేనన్నారు. ఈ రంగాల్లో వెంటనే, పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

