అదంత ఈజీ కాదు.. వేగవంతమైన ఆర్థిక సంస్కరణలు, నిర్మాణాత్మక మార్పులు అవసరం
భారత్ 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలువాలంటే వేగవంతమైన ఆర్థిక సంస్కరణలు, నిర్మాణాత్మక మార్పులు అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లహిరి అన్నారు. శుక్రవారం ఇక్కడ ఎస్ఆర్సీసీ శతాబ్ది సదస్సులో మాట్లాడుతూ..
- 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలుపాలన్న ప్రభుత్వ లక్ష్యంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లహిరి
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : భారత్ 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలువాలంటే వేగవంతమైన ఆర్థిక సంస్కరణలు, నిర్మాణాత్మక మార్పులు అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లహిరి అన్నారు. శుక్రవారం ఇక్కడ ఎస్ఆర్సీసీ శతాబ్ది సదస్సులో మాట్లాడుతూ.. చైనా, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ వంటి ఆసియా దేశాలు తమ తలసరి ఆదాయాన్ని వేగంగా పెంచుకున్నాయని, తద్వారా అధిక ఆదాయ దేశాలుగా నిలిచాయన్నారు. నిర్దిష్ట పరిమితిని స్థూల జాతీయ తలసరి ఆదాయం దాటినప్పుడే ఇది సాధ్యమని చెప్పారు. ఉదాహరణకు 2027లో తలసరి ఆదాయం 14,375 డాలర్లుగా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం దృష్ట్యా దాదాపు 18,000-20,000 డాలర్లుగా తలసరి ఆదాయం ఉంటేనే భారత్ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం 2,813 డాలర్లుగానే ఉందని గుర్తుచేశారు. వచ్చే 20 ఏండ్లలో కనీసం 15,000 డాలర్ల మేర పెరుగాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. అయినా దీన్నో కలగానే భావించరాదని.. ఆసియాలో చైనా, జపాన్, తైవాన్, కొరియాలు సాధించాయి కాబట్టి మనమూ సాధించే వీలుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ సంస్కరణల అమల్లో వేగం పెరుగాలని, నిర్మాణాత్మక మార్పులు రావాలని.. అప్పుడే సాధ్యమని స్పష్టం చేశారు. మొత్తానికి సర్కార్.. ‘వికసిత్ భారత్ 2047’ పేరుతో హడావుడి చేస్తున్న వేళ సాక్షాత్తు ప్రధాని మోదీనే చైర్మన్‌గా ఉన్న నీతి ఆయోగ్‌లో వైస్ చైర్మన్ ఈ విధంగా మాట్లాడటం.. ప్రభుత్వ నిర్వహణలో పాలనాపరమైన, విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నది.
ఈ మూడు కీలకం
దేశంలో వృద్ధిరేటు పరుగులు పెట్టాలంటే విద్య, ఆరోగ్యం, మౌలిక రంగాల బలోపేతం కీలకమని లహిరి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ‘విద్యావంతులైన ప్రజలు పేదరికంలో ఉన్న దేశాన్ని లేదా నిరక్షరాస్యులైన ప్రజలు ధనవంతులుగా ఉన్న దేశాన్నిగానీ మీరు ప్రపంచంలో ఎక్కడా చూపలేరు. అలాగే ఆరోగ్యవంతులైన ప్రజలు పేదలుగా ఉన్న దేశాన్ని లేదా శ్రీమంతులుగా ఉన్న ప్రజలు అనారోగ్యంబారినపడ్డ దేశాన్నిగానీ కనిపెట్టడం కష్టం’ అన్నారు. ఏ దేశ ఆర్థిక వృద్ధికైనా ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత సామర్థ్యాలున్న శ్రామిక శక్తి ముఖ్యమన్నారు. వాటిని పెంపొందించు కోవడం అవసరమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

