Nissan Magnite Giza Edition | దేశీయ మార్కెట్లోకి నిసాన్ మాగ్నైట్ గిజా ఎడిషన్.. రూ.7.39 లక్షల నుంచి షురూ..!
Nissan Magnite Giza Edition | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి స్పెషల్ ఎడిషన్ మాగ్నైట్ గిజా ఎడిషన్ కారు తెచ్చింది. రూ.11 వేలు పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
Nissan Magnite Giza Edition | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్ ఇండియా’ దేశీయ మార్కెట్లోకి సబ్-కంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ ‘మాగ్నైట్ (SUV Magnite)’ తీసుకొచ్చింది. న్యూ మాగ్నైట్ గిజా ఎడిషన్ (New Magnite Giza) కారు ధర రూ.7.39 లక్షలుగా నిర్ణయించింది. ఆసక్తిగల వారు వెబ్సైట్ ద్వారా గానీ, ఏదేనీ నిసాన్ షోరూమ్‌లో గానీ రూ.11 వేలు పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
జపాన్ థియేటర్ ఎక్స్ ప్రెస్సివ్ మ్యూజికల్ స్ఫూర్తిగా మాగ్నైట్ గిజా (Magnite Giza) రూపుదిద్దుకున్నది. మాగ్నైట్ గిజా (New Magnite Giza) ఫైవర్ కలర్ ఆప్షన్లు – బ్లేడ్ సిల్వర్(Blade Silver), ఫ్లేర్ గార్నెట్ రెడ్ ( Flare Garnet Red), స్టోర్మ్ వైట్ (Storm White), శాండ్ స్టోన్ బ్రౌన్ (Sandstone Brown), ఒనిక్స్ బ్లాక్ (Onyx Black) రంగుల్లో లభిస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ గిజా ఎడిషన్ 999సీసీ కెపాసిటీ గల 1.0-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తున్నది. గిజా ఎడిషన్‌లో హయ్యర్ వేరియంట్లు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ ఆప్షన్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 71 బీహెచ్పీ విద్యుత్, 96 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
స్టాండర్డ్ వేరియంట్ కారుతో పోలిస్తే మాగ్నైట్ గిజా ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు జత చేశారు. 9.0 (22.86 సీఎం) – అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, జేబీఎల్ స్పీకర్లు, అంబియెంట్ లైటింగ్ విత్ యాప్ బేస్డ్ కంట్రోల్స్, రేర్ కెమెరా, బీజ్ అప్ హోల్స్టరీ (ఆప్షనల్), షార్క్ ఫిన్ యాంటీనా వంటి ఫీచర్లు కొత్తగా వచ్చాయి.
సేఫ్టీ కోసం న్యూ మాగ్నైట్ గిజా ఎడిషన్ కారులో ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ డైనమిక్ కంట్రోల్ విత్ స్టీరింగ్ యాక్టివ్ లెర్నింగ్ ఫీచర్లు ఉన్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు రెండో దశ బీఎస్-6 ప్రమాణాలతో నిసాన్ న్యూ మాగ్నైట్ గిజా ఎడిషన్ రూపుదిద్దుకున్నది.
నిస్సాన్ న్యూ మాగ్నైట్ గిజా ఎడిషన్ కారు పట్ల ఆసక్తి గల వారు.. దేశవ్యాప్తంగా ఏదేనీ నిసాన్ షోరూమ్‌లోనైనా, అధికారిక వెబ్సైట్ ద్వారా రూ.11 వేలు పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు డెలివరీ చేస్తారన్న వివరాలను నిసాన్ ఇండియా వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

