Hyundai New Verna | మార్కెట్లోకి న్యూ వెర్నా.. ధర రూ.10.89 లక్షల నుంచి షురూ..!
Hyundai New Verna | హ్యుండాయ్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి ఆల్ న్యూ వెర్నా మోడల్ కారు తీసుకొచ్చింది. దీని ధర రూ.10.89 లక్షల నుంచి మొదలవుతుంది.
Hyundai New Verna | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా మంగళవారం దేశీయ మార్కెట్లో తన న్యూ జనరేషన్ మిడ్ సైజ్ సెడాన్ `వెర్నా` ఆవిష్కరించింది. దీని ధర రూ.10.89 లక్షల నుంచి మొదలై రూ.17.38 లక్షల వరకు పలుకుతుంది. ఆల్ న్యూ వెర్నా లీటర్ పెట్రోల్‌పై 20 కి.మీ. మైలేజీ ఇస్తుంది. గత నెలలోనే రూ.25 వేలతో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 8000 కార్లకు బుకింగ్స్ నమోదయ్యాయి. వచ్చేనెల మొదటి వారం నుంచి న్యూ వెర్నా కార్లు డెలివరీ చేయనున్నది. మూడేండ్ల అపరిమిత వారంటీ కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఇవీ స్పెషిఫికేషన్స్
- నాలుగు ట్రిమ్స్, రెండు ఇంజిన్ల ఆప్షన్లు, తొమ్మిది రంగుల్లో లభ్యం.
- ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్స్‌లో లభ్యం.
- టైఫూన్ సిల్వర్, ఫెయిరీ రెడ్, స్టారీ నైట్, టైటాన్ గ్రే, అబ్యాస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ వంటి ఏడు రకాల మొనోటోన్ కలర్ ఆప్షన్లు.
- అట్లాస్ వైట్, ఫెయిరీ రెడ్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం.
- 6-ఎయిర్‌బ్యాగ్స్, 4-డిస్క్ బ్రేక్లతోపాటు 65కి పైగా సేఫ్టీ ఫీచర్లు.
- అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)తోపాటు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్.
- వెర్నాతోపాటు న్యూ హోండా సిటీ కారులోని కొన్ని వేరియంట్లలోనూ అడాస్ ఫీచర్స్.
- ప్రయాణికుల సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వీఎస్ఎం, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్.
- ఫ్రంట్‌లో మైక్ఫెర్సన్ స్ట్రట్ టైప్ సస్పెన్షన్, టోరిసన్ బీమ్ యాక్సిల్ విత్ ఏ వెర్టికల్ షాక్ అబ్సార్బర్ ఎట్ రేర్.
- అడాస్‌తో డ్రైవర్‌కు ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, లేన్ కీపింగ్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్.
ఇంజిన్ స్పెషాలిటీస్
- ఆల్ న్యూ వెర్నా 1.5 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. 115 పీఎస్ విద్యుత్, 144 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
- 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 7-స్పీడ్ డ్యూయల్ టచ్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఐవీటీ) ఆప్షన్.
- మాన్యువల్ ట్రాన్స్మిషన్పై లీటర్ పెట్రోల్ 18.60 కి.మీ. మైలేజీ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్పై 19.60 కి.మీ. మైలేజీ.
- 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
- 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ ఐవీటీ గేర్‌బాక్స్.
- ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్‌లో లభ్యం.
- రెండు ఇంజిన్లు కూడా ఆర్డీఈ కంప్లియంట్, ఈ-20 పెట్రోల్‌తో నడుస్తాయి.
ఎక్స్టీరియర్లో సింగిల్ పేన్ సన్‌రూఫ్, స్టయిల్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ ట్రిపుల్ బార్డ్ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాప్ సెటప్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, లార్జ్ ఎల్ఈడీ లైట్ బార్, క్రోమ్ డిటైలింగ్ అండ్ ఓఆర్వీఎం మౌంటెడ్ కెమెరాలు.
ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కూడిన డ్యుయల్ స్క్రీన్ సెటప్‌తో కూడిన డాష్‌బోర్డ్.
వైర్లెస్ చార్జర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఏసీ వెంట్స్, యాంబియంట్ లైట్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

