iPhone 16 -Discount | ఆపిల్ బంపరాఫర్ ఐ-ఫోన్ 16 ఫోన్‌పై రూ.37,900 డిస్కౌంట్..!
iPhone 16 -Discount | తాజాగా మార్కెట్లో సేల్స్ ప్రారంభమైన ఐ-ఫోన్ 16 ఫోన్ మీద ఆపిల్ ట్రేడ్ ఇన్ వాల్యూ కింద రూ.37,900 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
iPhone 16 -Discount | ఈ నెల తొమ్మిదో తేదీన ఆపిల్ ఆవిష్కరించిన నూతన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు – ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ల సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ కింద ఐ-ఫోన్ 16 ఫోన్ మీద ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. పాత ఐ-ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద గణనీయ రాయితీ లభిస్తుంది. ఆయా మోడల్ ఫోన్లు, వాటి పరిస్థితిని బట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఐ-ఫోన్ 16 కొనుగోలు దారులకు స్టోరేజీ కెపాసిటీ, బ్యాటరీ హెల్త్ తదితర పరిస్థితులను బట్టి పాత ఐ-ఫోన్ మీద గరిష్టంగా రూ.37,900లకు లభిస్తుంది. ఐ-పోన్ 16 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.79,900. ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ కింద ఐ-ఫోన్ 12 ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తించకపోతే ఆ ఫోన్లను ఉచితంగా ఆపిల్ రీసైక్లింగ్ చేసి అందజేస్తుంది.
ఐ-ఫోన్ 15 ఫోన్‌పై ట్రేడ్ ఇన్ వాల్యూ ఇలా
ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.79,900లకు లాంచ్ చేసినా ప్రస్తుతం రూ.69,900లకు లభిస్తుంది. ఐ-ఫోన్ 16 కొనుగోలు కోసం ఐ-ఫోన్ 15ను ఎక్స్చేంజ్ చేస్తే ట్రేడ్ ఇన్ క్రెడిట్ ద్వారా రూ.37,900 డిస్కౌంట్ అందిస్తుంది. సదరు ఫోన్ స్టోరేజీ కెపాసిటీ, బ్యాటరీ హెల్త్ ఆధారంగా డిస్కౌంట్ లభిస్తుంది.
ఇలా ఐ-ఫోన్ 14 ఫోన్ మీద రాయితీ
ఐ-ఫోన్ 14 యూజర్లు ఇప్పుడు ఐ-ఫోన్ 16 కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. దీనిపై రూ.32,100 వరకు ఆపిల్ క్రెడిట్ ఇన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఐ-ఫోన్ 14 ఫోన్ రూ.59,900లకు లభ్యం అవుతుంది.
ఐ-ఫోన్ 13.. ఐ-ఫోన్ 12లపై ట్రేడ్ ఇన్ వాల్యూ ఇలా
మీరు మీ వద్ద ఉన్న ఐ-ఫోన్ 13 స్థానంలో కొత్త ఐ-ఫోన్ 16 కొనుగోలు చేయాలనుకున్నారా.. అయితే ఆపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ కింద రూ.31,000 క్రెడిట్ లభిస్తుంది. ఐ-ఫోన్ 12 యూజర్లు రూ.20,800 ట్రేడ్ ఇన్ వాల్యూ కింద డిస్కౌంట్ పొందొచ్చు.
భారీ వర్షంలోనూ ఐ-ఫోన్ 16 కోసం బారులు తీరిన కస్టమర్లు
ఆపిల్ ఐ-ఫోన్ 16 ఫోన్ కోసం యూజర్లు ముంబై, ఢిల్లీ నగరాల్లో సంస్థ స్టోర్ ముందు బారులు తీరారు. ముంబైలో భారీ వర్షం కురుస్తున్నా సుమారు 400-500 మంది క్యూ లైన్లో ఉన్నారని ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఢిల్లీలో ఉదయం ఎనిమిది గంటలకు స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సుమారు 200-300 మంది కస్టమర్లు క్యూలో ఉంటున్నారు. బ్లింకిట్, బీబీ నౌ వంటి క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై ఆర్డర్లు అసాధారణ రీతిలో నమోదవుతున్నాయి. ఐ-ఫోన్ 15 కంటే ఐ-ఫోన్ 16 కొనుగోళ్లు 25 శాతం ఎక్కువ అని ఆపిల్ వర్గాల కథనం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

