హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్.. నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రాం (ఎన్ఏడీసీఏపీ) సర్టిఫికేషన్‌ను అందుకున్నది. అమెరికాకు చెందిన పర్ఫార్మెన్స్ రివ్యూ ఇన్స్టిట్యూట్ (పీఆర్ఐ) నుంచి రాష్ట్రంలోని రెండు యూనిట్లకుగాను దీన్ని పొందింది. ఐడీఏ జీడీమెట్ల వద్దనున్న తమ 100 శాతం ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్ (ఈవోయూ), యూనిట్ 5కిగాను ఎంటీఏఆర్కు ఈ సర్టిఫికేషన్ దక్కింది. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పర్వత్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కెమికల్ ప్రాసెసింగ్, పెయింట్ అండ్ డ్రై ఫిల్మ్ కోటింగ్స్, సొల్యూషన్ అనాలసిస్ అండ్ టెస్టింగ్‌ల కోసం ఎన్ఏడీసీఏపీ మేనేజ్మెంట్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్ వచ్చిందన్నారు.