న్యూఢిల్లీ, ఆగస్టు 21 : ఈ-కామర్స్ సేవల సంస్థ మీషో.. వచ్చే పండుగ సీజన్లో డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాతో విక్రయ, లాజిస్టిక్ విభాగాల్లో 10 లక్షల సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నది. వీరిలో 6.5 లక్షల ఉద్యోగాలు సెల్లర్ నెట్వర్క్ విభాగాల్లో లభించనుండగా, మరో 3.75 లక్షల ఉద్యోగాలు లాజిస్టిక్ ఆపరేషన్స్‌లో లభించే అవకాశం ఉన్నదని పేర్కొంది.
మన వ్యవస్థలోని వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కోవడానికి వచ్చే పండుగ సీజన్ ఒక కీలకమైన సమయమని పేర్కొంది.