దేశీ రోడ్లపై దూసుకెళ్లనున్న మెక్లారెన్ కార్లు..భారత్‌లో త్వరలో సూపర్‌కార్ ఎంట్రీ!
2022 ద్వితీయార్ధంలో భారత్ మార్కెట్లోకి రానున్నట్టు బ్రిటిష్ సూపర్‌కార్ మేకర్ మెక్లారెన్ అధికారికంగా వెల్లడించింది.
న్యూఢిల్లీ : 2022 ద్వితీయార్ధంలో భారత్ మార్కెట్లోకి రానున్నట్టు బ్రిటిష్ సూపర్‌కార్ మేకర్ మెక్లారెన్ అధికారికంగా వెల్లడించింది. ముంబైలో ఈ ఏడాది అక్టోబర్‌లో తొలి డీలర్షిప్ అందుబాటులోకి రావడంతో మెక్లారెన్ కారు మోడల్స్ అన్నీ దేశీ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.

ఐకానిక్ మెక్లారెన్ ఎఫ్1 తయారీ సంస్ధ మెక్లారెన్ కార్స్ బ్రాండ్ మెక్లారెన్ ఆటోమోటివ్గా అవతరించి స్పోర్టీ, రేసింగ్ కార్ల తయారీలో సత్తా చాటుతోంది. బ్రిటన్‌లోని సర్రే కేంద్రంగా మెక్లారెన్ టెక్నాలజీ సెంటర్లో తన కార్లను మెక్లారెన్స్ డెవలప్ చేస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంంలో రిటైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా ముంబైలో డీలర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నామని మెక్లారెన్ ఆటోమోటివ్ ఆసియాపసిఫిక్, చైనా మేనేజింగ్ డైరెక్టర్ పౌల్ హారిస్ పేర్కొన్నారు.

మెక్లారెన్ ముంబై రిటైల్ సెంటర్ మెక్లారెన్ కార్ బ్రాండ్ కస్టమర్లకు మెరుగైన అవకాశమని మెక్లారెన్ ముంబైకి చెందిన లలిత్ చౌధురి తెలిపారు. ముంబై రిటైల్ సెంటర్లో మెక్లారెన్ జీటీ, హై పెర్ఫామెన్స్ హైబ్రిడ్-అర్టురా, 720ఎస్ కూపే, స్పైడర్, 765ఎల్టీ వంటి మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- entry
- India
- Launch
- luxuery car
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

