జామ్‌నగర్ రిఫైనరీకి రూబియో
బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, భారత్‌కు అమెరికా రాయబారి సెర్గియోలతో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ
జామ్‌నగర్, అక్టోబర్ 21: అమెరికా ఇంధన సంబంధాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో…బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్నకు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఏర్పాటు చేసిన ప్రపంచంలో అతిపెద్ద చమురు క్షేత్రాల్లో ఒకటైనా ఈ క్షేత్రాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో నెలకొల్పింది.
ఈ కార్యక్రమానికి ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, ఆయన భార్య రాధిక మార్చెంట్, కుమార్తె ఈషా అంబానీ, ఆమె భరత్త ఆనంద్ పిరమల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దశలవారీగా ప్రారంభమవుతున్న రిలయన్స్ న్యూ ఎనర్జీ గిగా-ఫ్యాక్టరీలు, నిర్మాణంలో ఉన్న డాటా సెంటర్ల గురించి రూబియోకు వివరించారు. ఈ పర్యటనలో ప్రపంచ ఇంధన రంగం, సంప్రదాయ, నూతన ఇంధన రంగాల్లో వాణిజ్య భాగస్వామ్యాల అవకాశాలపై చర్చలు జరిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

