Home Loans | దీపావళి సందర్భంగా బ్యాంకుల బంపర్ ఆఫర్లు.. తక్కువ వడ్డీరేట్లపైనే ఇండ్ల రుణాలు.. ఇవీ డిటైల్స్..!
Home Loans | ఇండ్లు కొనుక్కోవాలని భావించే వారికి గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెనరాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీరేట్లకే ఇండ్ల రుణాలు ఆఫర్ చేస్తున్నాయి.
Home Loans | భారతీయులు పండుగల సందర్భంగా.. ప్రత్యేకించి దీపావళి సందర్భంగా తమకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సుదీర్ఘ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సుదీర్ఘ స్వప్నాల్లో సొంతిల్లు ఒకటి. రుణంపై సొంతిల్లు కొనుక్కోవాలని మీరు భావిస్తున్నారా.. అయితే, అందుకు ఇదే మంచి తరుణం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆకర్షణీయమైన వడ్డీరేట్లకు ఇంటి రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు కూడా మాఫీ చేస్తున్నాయి. ఇండ్ల రుణాలపై ఆయా బ్యాంకుల వడ్డీరేట్లు, ఆఫర్లు చెక్ చేసుకున్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సరైన బ్యాంకు ఎంచుకోవచ్చు. బ్యాంకులు ఇచ్చే ఇండ్ల రుణాలు.. వాటిపై వడ్డీరేట్లలో రాయితీ, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ తదితర వివరాలు తెలుసుకుందామా..
ఎస్బీఐలో 8.4 శాతం వడ్డీకే ఇండ్ల రుణం
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. ఫెస్టివ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఇండ్ల రుణాలపై 65 బేసిక్ పాయింట్ల వరకూ వడ్డీరేటు రాయితీ అందిస్తుంది. రెగ్యులర్ ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 9.15 శాతం. కానీ, పండుగల సీజన్ లో 8.4 శాతం వడ్డీపై ఆఫర్ చేస్తోంది. ఇండ్ల రుణాలపై టాపప్ రుణాలు కూడా 8.9 శాతం వడ్డీరేటుకే అందిస్తున్నది. ఇండ్ల రుణాలు, టాపప్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 50 శాతం మాఫీ. డిసెంబర్ 31 వరకూ హోంలోన్లపై వడ్డీ రాయితీ కొనసాగుతుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 8.35 శాతం నుంచే వడ్డీ
2023 ఫెస్టివ్ ట్రీట్స్ కింద 8.35 శాతం వడ్డీరేటుకే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నది. సాధారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇండ్ల రుణాలపై 8.75 శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభం అవుతాయి. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ అందిస్తున్నది.
పీఎన్బీలో 8.4 శాతం వడ్డీరేటు నుంచి ఇండ్ల రుణాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. తన ఖాతాదారులకు ‘దీపావళి ధమాకా 2023’ ఫెస్టివల్ ఆఫర్ కింద 8.4 శాతం వడ్డీరేటు నుంచి ఇండ్ల రుణాలు మంజూరు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నది. 2023 నవంబర్ నెలాఖరు వరకూ ఈ ఆఫర్లు లభిస్తున్నాయి.
ఎస్బీఐ, పీఎన్బీ బాటలోనే కెనరా బ్యాంక్..
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకు ఇండ్ల రుణాలపై 8.4 శాతం వడ్డీ నుంచి ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నది. జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో డాక్యుమెంటేషన్ చార్జీలు ఉంటాయి.
బ్యాంకు ఆఫ్ బరోడాలో ఇండ్ల రుణాలు ఇలా
బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ) తన ఖాతాదారులకు.. ఫెస్టివంజా ఆఫర్ల కింద 8.4 శాతం వడ్డీతో ఇండ్ల రుణాలు మంజూరు చేస్తున్నది. ప్రభుత్వ ప్రాజెక్టులు, టేకోవర్, నిర్మాణం పూర్తయిన ఇండ్లకు మరింత వడ్డీరేటు తగ్గింపు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అప్ ఫ్రంట్ ఫీజులో రాయితీ ఉంటుంది. ఈ స్పెషలాఫర్ డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి 8.5 శాతం వడ్డీ నుంచి ఇండ్ల రుణాలు మంజూరు అవుతాయి. 90 శాతం ఆస్తి విలువపైనా ఖాతాదారులు ఇండ్ల రుణాలు పొందొచ్చు.
ఇండ్ల రుణాలు పొందే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇండ్ల రుణాలు తీసుకోవాలని భావిస్తే వాణిజ్య ప్రకటనలను పట్టించుకోకుండా పలు బ్యాంకులు ఇచ్చే ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లను చెక్ చేసుకోవాలి. వడ్డీరేటుతోపాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజు తదితరాలు కలిపి మొత్తం ఇంటి రుణానికి ఎంత చెల్లించాల్సి వస్తుందో చూసుకోవాలి. ఇల్లు కొనుక్కునే వారు తమ కుటుంబ నికర ఆదాయంలో 30 శాతానికి మించి ఈఎంఐలు లేకుండా చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

