Lenovo Tab M9 | భారత్ మార్కెట్లోకి లెనెవో టాబ్ ఎం9.. ఇవీ స్పెషిపికేషన్స్.. ధరెంతంటే..?!
Lenovo Tab M9 | ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనెవో.. భారత్ మార్కెట్లోకి లెనెవో టాబ్ ఎం9 టాబ్లెట్ ఆవిష్కరించింది.
Lenovo Tab M9 | ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనెవో.. భారత్ మార్కెట్లోకి ‘లెనెవో టాబ్ ఎం9’ టాబ్లెట్ శుక్రవారం తీసుకొచ్చింది. డ్యుయల్ టోన్ డిజైన్‌తో వచ్చిన ఈ న్యూ ఆండ్రాయిడ్ టాబ్లెట్.. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హెలియో జీ80 ఎస్వోసీ చిప్ సెట్ మీద పని చేస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ టెక్నాలజీతోపాటు 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో లెనెవో టాబ్ ఎం9` టాబ్లెట్ వస్తున్నది. లెనెవో టాబ్ ఎం9 టాబ్లెట్ 5100 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జితో 13 గంటల వరకు వీడియో ప్లేబాక్ టైం కలిగి ఉంటుంది.
భారత్ మార్కెట్లో లెనెవో టాబ్ ఎం9 ధర రూ.12,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్రోస్ట్ బ్లూ, స్టోర్మ్ గ్రే కలర్ వేరియంట్లలో లభిస్తుంది. జూన్ ఒకటో తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, లెనెవో డాట్ కామ్ ఆన్ లైన్ స్టోర్లలో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ రిటైల్ చానెల్స్‌లో కొనుగోలు చేయొచ్చు. సీఈఎస్-2023లో గ్లోబల్ మార్కెట్లో లెనెవో టాబ్ ఎం9 ఆవిష్కరించారు. గ్లోబల్ మార్కెట్లో 139 డాలర్ల (సుమారు రూ.12 వేలు) నుంచి ఈ టాబ్లెట్ ధర ప్రారంభమైంది.
ఇవీ లెనెవో టాబ్ ఎం9 స్పెషిపికేషన్స్
లెనెవో టాబ్ ఎం9 టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 వర్షన్ మీద పని చేస్తుంది. మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, వన్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్ ఇస్తామని లెనెవో హామీ ఇచ్చింది. ఈ టాబ్లెట్ 9-అంగుళాల హెచ్డీ (800 X 1,340 పిక్సెల్స్) ఎల్సీడీ టీఎఫ్టీ డిస్ ప్లే విత్ 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. ఈ డిస్ ప్లేకు టీయూవీ ( TÜV) రెయిన్ లాండ్ ఐకేర్ సర్టిఫికెట్ లభించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ 80 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటది. ఇది 4జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్ కలిగి ఉంటుంది.
లెనెవో టబ్ ఎం9 టాబ్లెట్ 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఆటో ఫోకస్ కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 2-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 64 జీబీ ఈ-ఎంఎంసీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ టాబ్లెట్‌లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు.
4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ 5.1, హెడ్ ఫోన్ పోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంది. గూగుల్ వన్, గూగుల్ టీవీ, నెట్ ఫ్లిక్స్, యూ-ట్యూబ్ కిడ్స్ తదితర యాప్‌లు ప్రీ-లోడ్ చేస్తారు. యాస్సెలో మీటర్, ఆంబియెంట్ లైట్ సెన్సర్, హాల్ సెన్సర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. అథంటికేషన్ కోసం ఫేస్ అన్ లాక్ ఫీచర్ సపోర్ట్‌గా ఉంటుంది.
లెనెవో టాబ్ ఎం9 టాబ్లెట్ 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ విత్ 15 వాట్ల పాస్ట్ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 13 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం, 15 గంటల వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్, 12 గంటల వెబ్ బ్రౌజింగ్ టైం బ్యాటరీ సపోర్టింగ్ కలిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ తోపాటు డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

