Jio Fiber | యూజర్లకు జియో ఫైబర్ బంఫరాఫర్.. ఆ ప్లాన్‌తో ఇవీ బెనిఫిట్స్
Jio Fiber | రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సర్వీసెస్ సంస్థ జియో ఫైబర్.. తన యూజర్లకు వివిధ రకాల ప్లాన్లు ప్రకటించింది. రూ.198తో బ్యాకప్ ప్లాన్, రూ.999తో వార్షిక ప్లాన్ అందిస్తున్నది.
Jio Fiber | రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ విభాగం జియో ఫైబర్ (Jio Fiber) తన యూజర్లకు 150 ఎంబీపీఎస్ వేగంతో వార్షిక ప్లాన్ అందజేస్తున్నది. ఈ ప్లాన్ ఎంచుకున్న యూజర్లకు వివిధ రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తోపాటు సెట్-టాప్ బాక్స్ ఉచితంగా అందిస్తున్నది. వార్సిక ప్లాన్ వద్దనుకున్న వారు కూడా ఇతర గడువులతోనూ ఈ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు.
జియో ఫైబర్ 150 ఫైబర్ ఎంబీపీఎస్ వేగంతో ఇచ్చే వార్షిక ప్లాన్ టారిఫ్ రూ.11,988తోపాటు జీఎస్టీ అదనం. నెలకు రూ.999 చార్జీ చెల్లించాలి. ఆ తర్వాత కూడా ఎటువంటి అదనపు టారిఫ్ చార్జీ వసూలు చేయకుండానే మరో నెల రోజులు సర్వీసు పొడిగిస్తున్నది. అంటే నెలకు రూ.923కే 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు.
ఈ ప్లాన్ ఎంచుకున్న యూజర్లకు ఫిక్స్ డ్ లైన్ కనెక్షన్ అందిస్తున్నది జియో ఫైబర్. అపరిమిత కాలింగ్ ఆప్షన్ కూడా ఉచితంగానే ఉంటది. ల్యాండ్ లైన్ కనెక్షన్ పరికరాలు మాత్రం కస్టమర్లు ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి.
మరోవైపు యూజర్లకు 3.3 టీబీ పరిమితి గల డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ సబ్ స్క్రైబర్లు ‘మైజియో (My Jio)` యాప్ ద్వారా ఫ్రీగా సెట్ టాప్ బాక్స్ కోసం క్లయిమ్ చేయొచ్చు. ఈ ప్లాన్ పొందిన యూజర్లు వూట్ సెలెక్ట్, డిస్నీ + హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, సన్ నెక్ట్స్, వూట్ కిడ్స్, జీ5, హోయ్ చోయ్, డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, యూనివర్సల్ +, జియో జినిమా, ఈరోస్ నౌ, షెమరూమీ, ఆల్ట్ బాలాజీ, జియో సావన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోని కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు రూ.198లకు నెలవారీ బ్యాకప్ ప్లాన్ కూడా అందుబాటులోకి తెచ్చింది.
నెలవారీగా వివిధ టారిఫ్ లపై సబ్ స్క్రిప్షన్లు ప్రకటించింది జియో ఫైబర్. ఆ వివరాలు ఇలా
స్పీడ్ ————- నెల ధర —- ఓటీటీ యాప్స్ — లైవ్ టీవీ చానెళ్లు
10 ఎంబీపీఎస్ — రూ.298 ———– 6 ———- 400
10 ఎంబీపీఎస్ — రూ.398 ———- 14 ———- 550
30 ఎంబీపీఎస్ — రూ.499 ———- 6 ———- 400
30 ఎంబీపీఎస్ — రూ.599 ——— 14 ———- 550
100 ఎంబీపీఎస్ — రూ.799 ——– 6 ———- 400
100 ఎంబీపీఎస్ — రూ.899 ——- 14 ———- 550
150 ఎంబీపీఎస్ — రూ.999 ——- 15 ———- 550
300 ఎంబీపీఎస్ — రూ.1499 —– 16 ———- 550
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

